బాబోయ్.. పెళ్లిలో వరుడికి ఏకే 47 గిఫ్ట్.. వీడియో వైరల్
Groom Receives AK-47 Rifle as Gift on Wedding Day. సాధారణంగా పెళ్లిలో వధువు, వరుడికి బంధువులు, స్నేహితులు బంగారాన్నో
By Medi Samrat Published on 28 Nov 2020 1:54 PM GMTసాధారణంగా పెళ్లిలో వధువు, వరుడికి బంధువులు, స్నేహితులు బంగారాన్నో, ఖరీధైన వస్తువుల్ని బహుమతులు ఇస్తుంటారు. లేదా వరువరూల ఫోటోలతో కూడిన ఫ్రేమ్‌లను ఇవ్వడం చూశాం. అయితే.. ఓ మహిళ మాత్రం వరుడికి ఏకే 47 గన్ ను గిఫ్ట్‌గా ఇచ్చింది. సదరు మహిళ ఇచ్చిన బహుమతి చూసి అక్కడ ఉన్న వారంతా ఆశ్చరపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Kalashnikov rifle as a wedding present pic.twitter.com/BTTYng5cQL
— Adeel Ahsan (@syedadeelahsan) November 25, 2020
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 30సెకన్ల వీడియో పాకిస్తాన్ లో జరిగిన పెళ్లి అని నేషనల్ మీడియా పేర్కొంది. పెళ్లిమండపంలో వరుడు, వధువు పక్కపక్కనే కూర్చొని ఉండగా..అంతలో ఓ మహిళ సదరు వరుడికి శుభాకాంక్షలు తెలిపి.. పెళ్లి కానుకగా ఏకే 47 గన్ ఇవ్వడంతో వధువు షాక్ తినగా.. వరుడు మాత్రం బహుమతిని చూసి ఏ మాత్రం ఆశ్చర్యపోకుండా ముఖం మీద చిరునవ్వుతో దాన్ని అందుకోవడం గమనార్హం.
ఈ వీడియోను ''వివాహ బహుమతిగా కలాష్నికోవ్ రైఫిల్" అనే ట్యాగ్ లైన్‌తో అదీల్ హసాన్ అనే నెటిజన్ సోషల్ మీడియోలో షేర్ చేశాడు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ "బహుమతిని చూసి వధువు భయపడిందా?.. ఆమె సురక్షితంగా ఉందా?'' అని కామెంట్ చేయగా.. "క్షమించండి, అది పాకిస్తాన్ సంస్కృతి కాదు." అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ట్విట్టర్‌లో వైరల్ అయిన ఈ పోస్టును ఇప్పటివరకు 2.13 లక్షల మందికి పైగా చూడగా... 2.7 వేల లైక్స్ వచ్చాయి