ఫాంటాతో చేసిన మ్యాగీ.. టేస్ట్ చూడాలని అనుకుంటున్నారా..?

Ghaziabad vendor makes Maggi with Fanta. సోషల్ మీడియాలో ఎన్నో రకాల టేస్టీ వంటలు చూస్తూ ఉంటాము.. వీలైతే మనం కూడా

By Medi Samrat  Published on  22 Nov 2021 7:38 AM GMT
ఫాంటాతో చేసిన మ్యాగీ.. టేస్ట్ చూడాలని అనుకుంటున్నారా..?

సోషల్ మీడియాలో ఎన్నో రకాల టేస్టీ వంటలు చూస్తూ ఉంటాము.. వీలైతే మనం కూడా ఇళ్లల్లో ట్రై చేస్తూ ఉంటాము. కానీ కొన్ని కొత్త కొత్త.. వింతైన వంటకాలు చూస్తే మాత్రం షాక్ అవుతూ ఉంటాం తప్పకుండా..! అలాంటివి ఇటీవలి కాలంలో చాలానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మ్యాగీ గురించి మాట్లాడుకుంటే బ్యాచిలర్ల లైఫ్ లో చాలా తొందరగా తయారయ్యే వంట ఇది.. అంతేకాకుండా వీలు దొరికినప్పుడల్లా తినాలని అనుకుంటూ ఉంటాము. మ్యాగీలో కూడా ఎన్నో వెరైటీల గురించి విన్నాం కానీ 'ఫాంటా మ్యాగీ' గురించి మాత్రం ఎప్పుడూ వినలేదు. తాజాగా ఒక ఫుడ్ బ్లాగర్ ఫాంటాతో చేసిన మ్యాగీకి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశాడు. ఆ వంటను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. టేస్ట్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం అతడినే అడగాల్సిందే..!

ఘజియాబాద్‌కు చెందిన ఒక రోడ్డు పక్కన వ్యాపారి ఓ సరికొత్త ఆహార వంటకంతో మన ముందుకు వచ్చారు.ఆ డిష్ ఏమిటి అంటే.. ఫాంటా మ్యాగీ. ఫాంటాలో తయారు చేసిన మ్యాగీని విక్రయిస్తున్నారు. ఫుడ్ బ్లాగర్ అమర్ సిరోహి ఈ విచిత్రమైన సమ్మేళనాన్ని ప్రయత్నించారు. అతని YouTube ఛానెల్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోను పంచుకున్నారు. అది అతనికి నచ్చిందా? లేదా తెలుసుకోవాలంటే మొత్తం చదవాల్సిందే..!

ఫుడ్ ఇన్‌కార్నేట్‌కు చెందిన అమర్ సిరోహి ఫాంటా మ్యాగీని ప్రయత్నించడానికి అక్కడికి వెళ్ళాడు. షాపులో వంట వ్యక్తి కొన్ని కూరగాయలను వేయించి, ఆపై పాన్‌లో కొంత ఫాంటాను పోశాడు. తర్వాత కొన్ని మసాలాలతో పాటు మ్యాగీని కూడా వేశాడు. అతను నిమ్మరసం మరియు కొంత చాట్ మసాలాతో ఫినిషింగ్ ఇచ్చాడు. మొదట అమర్ సిరోహి ఈ విచిత్రమైన వంటకాన్ని ప్రయత్నించడంపై సందేహం వ్యక్తం చేశారు. కానీ తిన్నాక బాగుందని మెచ్చుకోవడం విశేషం. నిజానికి ఫాంటా మ్యాగీ ఇంత బాగుంటుందని తనకు తెలీదని అన్నారు. "మెయిన్ హైరాన్ హూన్ కి ఇస్కా ఇత్నా అచ్చా టేస్ట్ కైసే ఆ సక్తా హై (ఇది ఇంత రుచిగా ఉంటుందని నేను ఆశ్చర్యపోతున్నాను)" అని అమర్ సిరోహి వీడియోలో చెప్పారు. ఫాంటా మ్యాగీ ధర రూ. 30.. ఫాంటాకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. దాదాపు 5-6 నెలల నుంచి ఈ వంటకాన్ని అమ్ముతున్నట్లు విక్రేత తెలిపారు.


Next Story