రసగుల్లా చాట్ ను టేస్ట్ చేసిన ఫుడ్ బ్లాగర్.. ముఖంలో హావభావాలు చూస్తే

Food blogger tastes tikki rasgulla chaat. Her reaction is now a viral video. సాయంత్రం అయితే చాలు చాట్ తినాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

By Medi Samrat  Published on  12 Nov 2021 6:13 PM IST
రసగుల్లా చాట్ ను టేస్ట్ చేసిన ఫుడ్ బ్లాగర్.. ముఖంలో హావభావాలు చూస్తే

సాయంత్రం అయితే చాలు చాట్ తినాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. పానీ పూరీ, మసాలా పూరీ ఇలా టేస్ట్ చేస్తూ ఉంటారు. ఒకటే రకమైన చాట్ తిని తిని బోర్ కొట్టిన వాళ్లు కొత్తవి ట్రై చేస్తూ ఉంటారు. ఇక ఎంతో మంది ఫుడ్ బ్లాగర్లు విభిన్న రకాల చాట్ లను తింటూ ఉంటారు. కొద్దిరోజుల కిందట ఒక వ్యక్తి సేవ్, పెరుగు మరియు చట్నీలతో రసగుల్లా చాట్ చేసిన వీడియో వైరల్ అయింది. ఇప్పుడు ఒక ఫుడ్ బ్లాగర్ ఆ విచిత్రమైన చాట్ ను తినడానికి దుకాణాన్ని వెళ్ళింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తొలిసారిగా టిక్కీ రసగుల్లా చాట్‌ను టేస్ట్ చేస్తున్న వీడియోను ఆమె షేర్ చేసింది. ఫుడ్ బ్లాగర్ అంజలి ధింగ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

దీనికి మంచి వ్యూస్ వస్తూ ఉన్నాయి. ఆమెకు నచ్చిందా? అదేంటో తెలియాలంటే వీడియో చూడాల్సిందే. ఫుడ్ బ్లాగర్ అంజలి బయట నిలబడి టిక్కీ రసగుల్లా చాట్ ను చూపించడంతో వైరల్ వీడియో ప్రారంభమవుతుంది. ఆమె చేతిలో చాట్ ప్లేట్ ఉంది. ఆమె దానిని చూసి తినడం మొదలు పెట్టింది. అలా నోట్లోకి వేసుకుందో లేదో.. ఆమె ముఖంలో హావభావాలు పూర్తిగా మారిపోయాయి. ఏమి చెప్పాలో కూడా తెలియని సందిగ్ధంలో ఆమె పడిపోయింది. 140 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశానని అన్నారు. ఇక ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కు కామెంట్లు చాలానే వస్తున్నాయి.


Next Story