విమానంలో ఒక్కరే రాయల్ గా.. అమృత్ సర్ నుండి దుబాయ్ కు..!

Felt like royalty, says the only passenger in Air India flight from Amritsar to Dubai. ఒక్కరే విమానంలో వెళ్ళాలి అంటే..

By Medi Samrat  Published on  25 Jun 2021 4:57 PM IST
విమానంలో ఒక్కరే రాయల్ గా.. అమృత్ సర్ నుండి దుబాయ్ కు..!

ఒక్కరే విమానంలో వెళ్ళాలి అంటే.. ఆ విమానం మీదే అయినా అయుండాలి. లేదంటే రెంట్ కు తీసుకుని వెళ్ళాలి. కానీ ఓ ప్యాసెంజర్ విమానంలో ఒక్కరే వెళ్లాలంటే మాత్రం అదృష్టం ఉండాలి. ఇటీవలి కాలంలో అలాంటి ఘటనలే చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎవరిని పడితే వారిని ఇతర దేశాలు అనుమతించడం లేదు.. కాబట్టి విమానాలు కూడా చాలా వరకూ ఖాళీగానే ఉంటున్నాయి.

తాజాగా ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో అమృత్‌స‌ర్ నుంచి దుబాయ్‌కు ఒకే ఒక ప్యాసింజ‌ర్‌ వెళ్లారు. పారిశ్రామిక‌వేత్త ఎస్‌పీ సింగ్ ఒబెరాయ్ ఎకాన‌మీ క్లాస్ టికెట్‌తో ఆయ‌న ఒక్క‌రే ఆ విమానంలో వెళ్లారు. ఒబ్రాయ్‌కు గోల్డెన్ వీసా ఉండడమే కాకుండా.. యూఏఈ రెసిడెంట్ గా గుర్తింపు ఉంది. అమృత్‌స‌ర్‌లో బుధ‌వారం తెల్ల‌వారుజామున 3.45 నిమిషాల‌కు ఆ విమానం బ‌యలుదేరిన‌ట్ల అధికారులు తెలిపారు. ప్ర‌యాణ స‌మ‌యంలో ఆయ‌న ఆ విమాన సిబ్బందితో ఫోటోలు దిగారు. గ‌డిచిన కొన్ని వారాల్లో.. దుబాయ్‌కు వెళ్తున్న విమానంలో ఒకే ఒక ప్యాసింజెర్ ఉండ‌డం ఇది మూడ‌వ సారి. ముంబై నుంచి దుబాయ్‌కి వెళ్లిన ఎమిరేట్స్ విమానంలో భ‌వేశ్ జ‌వారీ అనే వ్య‌క్తి ఒక్క‌రే ప్ర‌యాణించారు. ముంబై నుంచి వెళ్లిన మ‌రో విమానంలో ఓస్వాల్డ్ రోడ్రిగ్స్ అనే వ్య‌క్తి ప్ర‌యాణించారు. ఇప్పుడు ఎస్‌పీ సింగ్ ఒబెరాయ్ రాయల్ గా ప్రయాణం సాగించారు.

ఒబెరాయ్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఈ ప్రయాణం గురించి వివరిస్తూ "Sometimes, in vital situations we get opportunities to cherish for life. Highly appreciate the Government of UAE and India for making it a memorable journey. Thank you, Air India, for special services - you made it absolutely a wonderful journey." అని పోస్టు పెట్టారు. ఒబెరాయ్ ను పైలట్ స్వాగతం పలికారు. "రాయల్ ట్రీట్మెంట్" ఇచ్చారు. ఖాళీ విమానంలో అతని అనేక ఫోటోలను క్లిక్ చేశారు. ఒబెరాయ్ తన సోలో విమాన అనుభవం కోసం 740 దిర్హామ్‌లను చెల్లించాడు. భారతదేశంలో కోవిడ్ కేసుల్లో సెకండ్ వేవ్ పెరుగుదల ఫలితంగా ఏప్రిల్ 24 న విధించిన ప్రయాణ నిషేధం ఉన్నప్పటికీ, యుఎఇ అధికారులు దౌత్యవేత్తలు, గోల్డెన్ వీసా హోల్డర్లు, ఎమిరాటిలను భారతదేశం నుండి తమ దేశానికి వెళ్లడానికి అనుమతించారు. అలా ఒబెరాయ్ దుబాయ్ కు వెళ్లారు.

66 ఏళ్ల ఒబెరాయ్ పంజాబ్‌లోని పాటియాలాకు చెందినవారు. దుబాయ్‌లో ఒబెరాయ్ ప్రాపర్టీస్ & ఇన్వెస్ట్‌మెంట్స్ ఎల్‌ఎల్‌సి అనే సొంత వ్యాపారాన్ని నడుపుతున్నారు. అతను చాలా సంవత్సరాల క్రితం భారతదేశం నుండి దుబాయ్ వెళ్ళినప్పుడు, తన సొంత సంస్థను స్థాపించడానికి ముందు నాలుగు సంవత్సరాలు మెకానిక్ గా పనిచేశారు.




Next Story