హెల్మెట్‌ను మింగేసిన గ‌జ‌రాజు.. వీడియో వైర‌ల్‌

Elephant Ate Helmet In Assam. ద్విచక్రవాహనానికి తగిలించిన హెల్మెట్‌ను ఓ ఏనుగు మింగేసిన ఘటన అసోంలోని గువహటిలో జరిగింది.

By Medi Samrat  Published on  10 Jun 2021 1:00 PM GMT
హెల్మెట్‌ను మింగేసిన గ‌జ‌రాజు.. వీడియో వైర‌ల్‌

ద్విచక్రవాహనానికి తగిలించిన హెల్మెట్‌ను ఓ ఏనుగు మింగేసిన ఘటన అసోంలోని గువహటిలో జరిగింది. సత్‌గావ్‌ ఆర్మీ క్యాంపు సమీపంలో సంచరిస్తున్న ఓ ఏనుగు.. అక్కడే రోడ్డుపై నిలిపిన బైక్‌కు దగ్గరికి వచ్చి చూసింది. అనంతరం బైక్‌ అద్దానికి తగిలించిన హెల్మెట్‌ను తొండంతో తీసుకుంది. ఆ తర్వాత రెండు అడుగులు వేసిన గజరాజు ఆ హెల్మెట్‌ను పొట్టలో వేసుకుంది.


అనంతరం తనకేమీ తెలియదన్నట్లు ముందుకు సాగింది. ఇదంతా సమీపంలో ఉండి గమనిస్తున్న కొంత మంది అధికారులు ఏనుగు హెల్మెట్‌ను కిందపడేసి తొక్కేస్తుందని భావించారు. కానీ ఏనుగు మాత్రం నోట్లోకి వేసుకొని మింగేసింది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Next Story
Share it