'చోళీకే పీచే క్యా హై' పాటకు డ్యాన్స్ చేసిన పెళ్ళికొడుకు.. పెళ్లిని ఆపేసిన వధువు తండ్రి

తన పెళ్లిలో బాలీవుడ్ సాంగ్ కు నృత్యం చేసిన ఢిల్లీ వరుడు ఊహించని షాక్ తిన్నాడు.

By Medi Samrat  Published on  2 Feb 2025 10:01 AM IST
చోళీకే పీచే క్యా హై పాటకు డ్యాన్స్ చేసిన పెళ్ళికొడుకు.. పెళ్లిని ఆపేసిన వధువు తండ్రి

తన పెళ్లిలో బాలీవుడ్ సాంగ్ కు నృత్యం చేసిన ఢిల్లీ వరుడు ఊహించని షాక్ తిన్నాడు. చోలీ కే పీచే క్యా హై పాటకు డ్యాన్స్ చేయమని అతని స్నేహితులు అడగ్గా, వరుడు మొదట అందుకు ఒప్పుకోలేదు. చివరికి వరుడు ఆ పాటకు డ్యాన్స్ చేశారు. ఇది చూసిన వధువు తండ్రి ఈ పెళ్లిని రద్దు చేశాడు. వరుడు తన ఊరేగింపుతో న్యూఢిల్లీలోని వేదిక వద్దకు చేరుకున్నాడు. అతని స్నేహితులు అతన్ని డ్యాన్స్ చేయమని ప్రోత్సహించారు,

'చోళీకే పీచే క్యా హై' పాట ప్లే చేశారు.. పెళ్లి కొడుకు కూడా డ్యాన్స్ చేశాడు. కొంతమంది అతిథులు అతనిని ఉత్సాహపరిచారు, కానీ వరుడి చర్యలు వధువు తండ్రిని ఫీల్ అయ్యేలా చేశాయి. అనుచితమైన ప్రదర్శనను చూసి కోపోద్రిక్తుడైన వధువు తండ్రి వెంటనే వేడుకను నిలిపివేసి, పెళ్లిని రద్దు చేశాడు. వరుడి చర్యలు తన కుటుంబ విలువలను అవమానించాయని ఆయన తెలిపారు. ఎవరు ఎంత చెప్పినా కూడా పెళ్లి కూతురు తండ్రి వారి మాటలు పట్టించుకోలేదు. చివరికి పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు.

Next Story