రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన భారత సంతతి వ్యక్తి
Couple in Kerala celebrates wedding anniversary with Rs. 3.3 crore jackpot win. భారత సంతతికి చెందిన వ్యక్తి రాత్రికి
By Medi Samrat
భారత సంతతికి చెందిన వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. యూకేలోని లోట్టోలాండ్ నుంచి 3.3 కోట్ల రూపాయల జాక్‌పాట్ అందుకోవడంతో రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. కేరళకు చెందిన షాజీ మథ్యూ అనే వ్యక్తి కటుంబంతో కలిసి యూకేలో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో అతడు సరదాగా అట్లాంటిస్ కాసియో అండర్ వాటర్ థీమ్ ఆన్‌లైన్ స్లాట్ గేమ్ ఆడాడు. కొద్ది రోజులకు అతడికి లాట్టోలాండ్ నుంచి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌లో అతడు డబ్బులు గెలుచుకున్నట్లు ఉంది.
మొదట అతడికి నమ్మకం కలగలేదు. ఆ తర్వాత డబ్బులు గెలుచుకున్నట్లు లోట్టోలాండ్ నుంచి కాల్ వచ్చింది. అది ప్రాంక్ కాల్ అనుకున్నాడు. చివరికి ఈ ప్రాసెస్ మొదలు పెట్టగా తాను రూ. 3.3 కోట్లు గెలుచుకున్నట్లు తెలుసుకుని షాక్ తిన్నాడు. జీవితంలో స్థిరపడటానికి సరిపోయే డబ్బు వచ్చిందని.. ఇప్పటికి నమ్మలేకపోతున్నానని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
మొదట ఆ డబ్బు మూడున్నర లక్షలు అనుకున్నానని.. అందులో మొత్తం ఎనిమిది అంకెల డిజిట్ ఉందని దాన్ని గుర్తించడంలో విఫలమయ్యానని అన్నారు. ఆ మొత్తం అక్షరాలు మూడున్నర కోట్లని లాటరీ నిర్వాహకులు చెప్పేవరకు కూడా నేను గుర్తించలేదని అన్నారు.
త్వరలో వివాహ వార్షికోత్సవం ఉండడంతో.. సంతోషంగా కుటుంబంతో కలిసి పెళ్లిరోజును వేడుకలా చేసుకుంటానన్నాడు. ఆ తర్వాత తన భార్యతో జాయింట్ అకౌండ్ తీసుకుని అందులో ఈ డబ్బును దాస్తానని, ఇందులో కొంత మొత్తాన్ని తమ పిల్లల పై చదువుకు, ఇంటి నిర్మాణం కోసం ఖర్చు చేస్తానని అన్నాడు. ఇక మరికొంత డబ్బును అనాథాశ్రమానికి ఇస్తానన్నాడు.