కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా దేశాల‌లో మాస్క్ తప్పనిసరి చేశాయి ప్ర‌భుత్వాలు. కొన్ని చోట్ల మాస్క్ ధరించని వారికి అధికారులు భారీ మొత్తంలో జరిమానా కూడా విధిస్తున్నారు. అయితే.. ఓ కేఫ్‌లో మాత్రం మాస్క్ ధరిస్తే.. ఫైన్ విధిస్తున్నారు. వినడానికి వింత‌గా ఉన్నా.. ఇది నిజం.

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఫిడిల్‌హెడ్స్ కేఫ్ యజమాని త‌న షాప్ కు వ‌చ్చిన‌ కస్టమర్లకు ఫైన్ల మీద ఫైన్లు వేస్తున్నాడు. ఆశ్చ‌ర్య‌మేమిటంటే.. కేఫ్‌కు వచ్చిన కస్టమర్లకు ఫైన్ విధించే విషయాన్ని ముందే చెబుతున్నాడు కూడా. కేఫ్‌లోని గోడలపై పెద్దపెద్ద అక్షరాలతో 'ఎవరైనా ఆర్డర్ చేసేటపుడు మాస్క్ ధరిస్తే 5 డాలర్లు.. టీకా తీసుకున్న విషయాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటే మరో ఐదు డాలర్ల ఫైన్ విధించబడును' అని పెద్ద అక్ష‌రాల‌తో ఓ గ‌మ‌నిక‌ను కూడా రాసిపెట్టాడు.

అయితే.. మాస్క్ ధరిస్తే.. ఫైన్ ఎంట‌నే సంగతి తెలుసుకుని కస్టమర్లు షాక్ అవుతున్నారు. కాగా.. ఓ స్వచ్ఛంద సంస్థ కోసమే స‌ద‌రు కేఫ్ య‌జ‌మాని ఇలా చేస్తున్నాడని తెలుసుకుని.. పోటీపడి మరీ కస్టమర్లు ఫైన్‌లు చెల్లిస్తున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ వార్త వైర‌ల్‌గా మారింది.సామ్రాట్

Next Story