వెరైటీగా బిల్‌ కట్టిన కస్టమర్‌.. ఆర్డర్‌ డెలివరీ కూడా వెరైటీగానే..!

Brits divided by cafe's revenge on bloke who paid for breakfast in 10p pieces. ఇటీవల సోషల్‌ మీడియాలో కాస్త వెరైటీగా ఏది చేసినా అది ఎలా వైరల్‌గా మారుతుందో

By అంజి  Published on  27 Sep 2021 3:06 AM GMT
వెరైటీగా బిల్‌ కట్టిన కస్టమర్‌.. ఆర్డర్‌ డెలివరీ కూడా వెరైటీగానే..!

ఇటీవల సోషల్‌ మీడియాలో కాస్త వెరైటీగా ఏది చేసినా అది ఎలా వైరల్‌గా మారుతుందో చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లయితే వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో షేర్‌ చేసిన క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో దూసుకుపోవడంతో పాటు అందులోని వారు సెలబ్రిటీలుగా మారినవారు చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి తాను ఆర్డర్‌ చేసిన సాండ్‌విచ్‌ ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. ఇంతకి ఏం జరిగిందంటే.. ఓ వ్యక్తి బాగా ఆకలికావడంతో దగ్గర్లోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లాడు. అంతవరకు బాగానే ఉన్న ఆ తర్వాత సాండ్‌విచ్‌ను ఆర్డర్‌ చేసిన అతని దగ్గర చిల్లర డబ్బులు ఉన్నాయి.

అయితే వాటిని ఇవ్వలా వద్దా అని ఆలోచించిన అతను.. చివరికి బిల్‌గా చిల్లర డబ్బులను ఇచ్చాడు. కొద్ది సమయం తర్వాత తను ఆర్డర్‌ చేసిన సాండ్‌ విచ్‌ రావడంతో.. దాన్ని ఓపెన్ చేసి షాక్‌ అయ్యాడు. అందులో వచ్చిన సాండ్‌విచ్‌ మొత్తం ముక్కలు ముక్కలుగా కట్‌ చేసివుంది. చిల్లర డబ్బులను బిల్‌గా కట్టాడని ఆ రెస్టారెంట్‌ వారు కూడా సాండ్‌విచ్‌ను ముక్కలు ముక్కలుగా కట్‌ చేసి ఆర్డర్‌ను అతనికి అందించారు. కాగా ముక్కలుగా ఉన్న సాండ్‌విచ్‌ ఫొటోను అతడు ట్విటర్ వేదికగా షేర్‌ చేశాడు. దీనికి సోషల్‌మీడియాలో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.Next Story