గాడిదల దొంగలు.. పరుగులు పెడుతున్న పోలీసులు

Ashok Gehlot's police is catching donkeys. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో గాడిదల దొంగతనం కారణంగా పోలీసులు

By Medi Samrat  Published on  31 Dec 2021 2:10 PM GMT
గాడిదల దొంగలు.. పరుగులు పెడుతున్న పోలీసులు

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో గాడిదల దొంగతనం కారణంగా పోలీసులు పరుగులు పెడుతూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు 76 గాడిదలు చోరీకి గురికావడంతో.. గాడిదల యజమానులు నిరసనకు దిగారు. దీంతో పోలీసుల గాడిదలను వెతుక్కుంటూ గ్రామ గ్రామాన తిరుగుతున్నారు. గాడిదలు దొంగిలించబడిన తర్వాత.. వాటి యజమానులు ఖుయాన్ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. చాలా ప్రాంతాల్లో గాడిదల కోసం సోదాలు చేశామని, కొన్నింటిని కూడా పట్టుకున్నామని ఏఎస్సై రామచంద్ర మీనా తెలిపారు. కానీ దొంగిలించిన గాడిదల యజమానులు మెహర్ చంద్, రాజు గార్, దిలీప్ గార్లు పట్టుకున్న గాడిదలు తమవి కావని చెప్పారు. గాడిద యజమానుల నిరసన దృష్ట్యా ప్రతి ఒక్కరూ తమ గాడిదలను షెడ్డులోకి తీసుకెళ్లాలని పోలీసులు గ్రామాల్లో ప్రకటన చేశారు.

గాడిదలను బహిరంగ ప్రదేశాల్లో వదలవద్దని ప్రజలను హెచ్చరించారు. ప్రస్తుతం పోలీసులతో పాటు గాడిదల యజమానులు కూడా తమ గాడిదలను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. గాడిద యజమానులు తమ గాడిదలను పిల్లల్లాగే చూస్తారని.. తమ గాడిదలకు చింటూ, మింటు, పింటూ అని పేర్లు పెట్టారు. ఈ ప్రాంతంలో చాలా కాలంగా గాడిదలు చోరీకి గురవుతున్నాయని గాడిదల యజమానులు చెబుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చోరీకి గురైన 70కి పైగా గాడిదల విలువ రూ.14 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు గాడిదలు, గొర్రెలు, మేకలు జీవనోపాధిలో భాగం. నలుగురు కానిస్టేబుళ్లు గాడిదలను వెతికే పనిలో నిమగ్నమయ్యారని, ఇప్పటి వరకు ఎలాంటి విజయం సాధించలేదని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ విజయేందర్ శర్మ తెలిపారు.


Next Story