ఆ చిన్నారి అద్భుతమైన క్రికెట్ షాట్లు.. అందరూ ఫిదానే..

Anand Mahindra shares viral video of little girl playing cricket. ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా ఖాతాలో ఎప్పటికప్పుడు సరి కొత్త

By Medi Samrat  Published on  12 Jun 2021 3:02 PM GMT
ఆ చిన్నారి అద్భుతమైన క్రికెట్ షాట్లు.. అందరూ ఫిదానే..

ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా ఖాతాలో ఎప్పటికప్పుడు సరి కొత్త వీడియోలను షేర్ చేస్తూ ఉంటారనే విషయం తెలిసిందే..! ఏదైనా నవ్వు తెప్పించే వీడియో అయినా.. ఎవరిలో అయినా ఏదైనా ట్యాలెంట్ ఉన్నా షేర్ చేయకుండా ఉండలేరు. తాజాగా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఒక చిన్నారి క్రికెట్ ఆడుతున్న వీడియోను తన మిలియన్ల ఫాలోవర్లతో పంచుకోకుండా ఉండలేకపోయారు.

క్రికెట్ కిట్ ను ధరించి ఆ బాలిక ఆడుతున్న బ్యాటింగ్ ను చూసి ఆనంద్ మహీంద్రా మెచ్చుకున్నారు. ఆరేళ్ల బాలికల బ్యాటింగ్ నైపుణ్యాలు ఆనంద్ మహీంద్రాను బాగా ఆకట్టుకున్నాయి. ది బెటర్ ఇండియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేసి.. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజును ఆయన తన పోస్టులో ట్యాగ్ చేశారు.

29 సెకన్ల నిడివి గల వీడియోలో ఉన్నది మెహక్ ఫాతిమాగా గుర్తించారు. ఆమె బ్యాటింగ్ నైపుణ్యాలు చూసి మహీంద్రా గ్రూప్ చైర్మన్ నుండి ప్రశంసలు మాత్రమే కాకుండా ఎంతో మంది ఆ చిన్నారి ట్యాలెంట్ ను పొగుడుతూ ఉన్నారు. ఆ చిన్నారి కాబోయే సూపర్ స్టార్ అని కూడా మెచ్చుకున్నారు ఆనంద్ మహీంద్రా. కిరణ్ రిజిజు ఈ అమ్మాయిని గుర్తించాలని కోరారు. ఈ అమ్మాయి ప్రతిభను వృధా చేయనివ్వవద్దని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. మెహక్ ఫాతిమా కోజికోడ్ కు చెందిన చిన్నారిగా గుర్తించారు.

ఆ చిన్నారి అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది. భవిష్యత్తులో భారతదేశం తరపున ఈ అమ్మాయి ఆడుతుందని.. అమ్మాయిలో గొప్ప ప్రతిభను దాగుందని ఒక యూజర్ రాశారు. " ఆ ఫ్రంట్ ఫుట్ కవర్ డ్రైవ్ ... అద్భుతం" అని మరొక యూజర్ రాసుకొచ్చారు.Next Story