అగ్గి పెట్టె మచ్చా.. చిత్తూరుకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే..! అతడు బూతులు మాట్లాడితే మామూలుగా ఉండదని అంటూ ఉంటారు. అయితే అతడి మానసిక పరిస్థితి గురించి కొందరు ఇంటర్వ్యూ చేశాక కానీ అందరికీ అర్థమవ్వలేదు. కొందరు అతడికి మందు ఆశ చూపి వీడియోలు చేయించడం కూడా తెలిసిందే. అతడి పాపులారిటీ కారణంగా పలు టీవీ షోలలో కూడా కనపడ్డాడు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతడి పేరు మీద కూడా ఒక గేమ్ ఉంది. మరీ భీభత్సమైన గేమ్ కాదు కానీ.. కింద పడకుండా ఎగురుతూ వెళ్లి హై స్కోరు చేయడాలు వంటివి..! ఈ గేమ్​లో నమస్తే అన్నా.. అంటూ మొదలుపెట్టే మచ్చా, తన స్టైల్​ పాట పాడడం, 'ఎగిరి తంతా'.., 'పోతే పోయిందని గానీ యెధవ ప్రాణం' లాంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

గేమ్ మొదలు పెట్టగానే అగ్గి పెట్టె మచ్చా పాడిన పాటతో మొదలై.. ఎగిరితే ఒక డైలాగ్.. పడిపోతే ఒక డైలాగ్.. ఇలా సాగే గేమ్ డౌన్ లోడ్స్ లో కూడా ముందుకు దూసుకుపోతోంది. ప్లే స్టోర్​లో Game on Aggipettimacha అనే ఈ గేమ్​ 'గేమ్​ ఆన్​ మీమ్'​ తరపున డెవలప్​ అయ్యింది. లక్షకు పైగా డౌన్​ లోడ్స్​​ సొంతం చేసుకుందట ఈ గేమ్. 4.4 రేటింగ్​ దక్కించుకుంది. 20 ఎంబీ సైజ్​ మాత్రమే ఈ గేమ్..! ఇతర క్యారెక్టర్లు ఉన్నా.. అగ్గిపెట్టె మచ్చాకే ఎక్కువ ఫాలోయింగ్ ఉందట..! ఇక ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని అగ్గిపెట్టె మచ్చా వైద్యానికి ఇవ్వాలని గేమ్ డెవెలపర్స్ భావిస్తూ ఉన్నారు. ఇంకొంచెం గేమ్ లో మార్పులు చేస్తే మరిన్ని డౌన్ లోడ్స్ జరుగుతాయని.. ఇంకా ఆసక్తికరంగా మార్చాలని పలువురు కోరుతూ ఉన్నారు.


సామ్రాట్

Next Story