A man swallowed entire Nokia 3310 phone. నోకియా 3310.. ప్రపంచం లోనే స్ట్రాంగెస్ట్ మొబైల్ అనే పేరు ఈ ఫోన్ కు ఉంది.
By Medi Samrat Published on 8 Sep 2021 11:50 AM GMT
నోకియా 3310.. ప్రపంచం లోనే స్ట్రాంగెస్ట్ మొబైల్ అనే పేరు ఈ ఫోన్ కు ఉంది. అప్పట్లో నోకియాకు భారీగా పాపులారిటీని తెచ్చిచ్చిన ఫోన్ ఇది. దీన్ని మించిన స్ట్రాంగెస్ట్ ఫోన్ భవిష్యత్తులో వస్తుందో లేదో తెలియదని.. ఈ మొబైల్ ఫోన్ ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు. అయితే ఈ ఫోన్ ను ఓ వ్యక్తి మిగేయడం కలకలం రేపింది. యూరప్‌లోని కోసోవో రిపబ్లిక్ ప్రిస్టినాకు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం నోకియా 3310 ఫోన్‌ను మింగేశాడు. ఫలితంగా అతని కడుపులో ఆ ఫోన్ ఇరుక్కుపోవడంతో ఆస్పత్రికి వెళ్లాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతని కడుపులో ఫోన్ ఉన్నట్లు గుర్తించి షాకయ్యారు.
అలా ఎలా మింగావయ్యా అని అతడిని తిట్టడమే కాకుండా.. లేటెస్ట్ టెక్నాలజీని వాడి, కడుపులోంచి ఫోన్‌ను బయటకు తీశారు. అతడికి స్కాన్ పరీక్షలు నిర్వహించిన తర్వాత కడుపులో ఫోన్ ఉన్నట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. అది కడుపులో వెళ్లిన అనంతరం మూడు భాగాలుగా విడిపోయి ఉందని, అన్నింటిని బాగానే బయటకు తీయగలిగామన్నారు. కాకపోతే బ్యాటరీని బయటకు తీసేటప్పుడే ఇబ్బంది ఎదురైందని, ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా అది కడుపు లోపలే పేలిపోయేదని తెలిపారు.