కుక్క పేరు మీద అన్ని కోట్ల ఆస్తి రాశారా..?
8-year-old border collie inherits $5M from owner. కుక్కకు ఉన్న విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By Medi Samrat Published on 13 Feb 2021 12:08 PM GMTకుక్కకు ఉన్న విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాస్త ప్రేమ చూపిస్తే చాలు జీవితాంతం మన చెంతనే ఉంటూ.. మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంటాయి. కొందరు కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. తాజాగా కుక్క పేరు మీద ఏకంగా 5 మిలియన్ డాలర్ల ఆస్తి రాయడం విశేషం. అమెరికాలోని టేన్నసీలో ఓ వ్యక్తి తన వీలునామాలో పెంపుడు కుక్క పేర మీద 5 మిలియన్ డాలర్ల ఆస్తి రాశాడు. భారతదేశ కరెన్సీలో చెప్పాలంటే 36,29,55,250 రూపాయలు. టేన్నసీకి చెందిన బిల్ డోరిస్(84) అనే వ్యక్తి గత ఎనిమిదేళ్లుగా 'లులు' అనే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. డోరీస్ తరచుగా ప్రయాణాలు చేసేవాడు. ఆ సమయంలో పెంపుడు కుక్క 'లులు'ని తన స్నేహితుడు మార్ట్ బర్టన్ వద్ద వదిలేసి వెళ్లేవాడు. గతేడాది డోరిస్ మరణించాడు. అప్పటి నుంచి లులు బాధ్యతని మార్టనే తీసుకున్నాడు.
కొద్ది రోజుల క్రితం డోరిస్ లాయర్ ఆయన చనిపోవడానికి ముందు రాసిన వీలునామాను మార్ట్‌కి అందించాడు. దానిలో డోరిస్ తన పెంపుడు కుక్క లులు పేరిట 5 మిలియన్ డాలర్ల ఆస్తి రాశాడు. ఈ మొత్తాన్ని లులు సంరక్షణకు, దాని అవసరాలు తీర్చడం కోసం వాడాలని కోరాడు. ఇక లులు బాధ్యతని తన స్నేహితుడు మార్ట్ తీసుకోవాల్సిందిగా వీలు నామాలో కోరాడు డోరిస్. లులు పేరు మీద ఉన్న ఆస్తికి అతను ట్రస్టీగా ఉంటాడని తెలిపాడు. డోరిస్ రాసిన వీలునామా చూసి నేను ఆశ్చర్యపోవడం మార్ట్ వంతైంది.
Next Story