4-ft-long cobra gets its head stuck in beer can. ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేస్తూ ఉంటున్నాం. మానవుడు చేసే తప్పుకి ఇప్పటికే
By Medi Samrat Published on 5 Dec 2021 10:33 AM GMT
ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేస్తూ ఉంటున్నాం. మానవుడు చేసే తప్పుకి ఇప్పటికే ఎన్నో జీవరాశులు బలయ్యాయి. మనం వేసే చెత్త చెదారం, డబ్బాలను నిర్లక్ష్యంగా విసిరేయడం వల్ల మనుషులకే కాకుండా జంతువులకు కూడా హాని కలుగుతోంది.భూమిపైన కాలుష్యం వివిధ మార్గాల్లో జీవులకు హాని కలిగిస్తుంది. విషపూరిత వ్యర్థాలు, కలుషితాల కారణంగా ప్రజలు, జంతువులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాయి. ఒడిశాలోని పూరి నుండి వచ్చిన ఒక వైరల్ వీడియోలో.. బీర్ టిన్ ను సరిగ్గా పారవేయకపోవడం వలన ఓ త్రాచు పాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వైరల్ వీడియోలో 4 అడుగుల పొడవున్న పాము తన తలను బీర్ క్యాన్‌లో ఇరికించుకుంది.
ఆ తర్వాత తనను తాను విడిపించుకోవడానికి పోరాడుతూ కనిపించింది. ఈ సరీసృపాన్ని మాధిపూర్ గ్రామంలోని స్థానికులు గుర్తించారు. పాము తల పూర్తిగా బీరు డబ్బా లోపల ఇరుక్కుపోవడంతో వన్యప్రాణుల అధికారులు సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చింది. తన ఎడమ చేతిలో ఒక బ్యాగ్, అతని కుడి వైపున మెటల్ స్నేక్ క్యాచర్‌తో పాము వద్దకు వచ్చాడు. డబ్బాను తొలగించడానికి ముందు బ్యాగ్ లోపల ఉంచగలిగాడు.పాము ఊపిరి పీల్చుకోవడానికి టిన్ ను మొదట ఒక వైపు కత్తిరించాడు.. డబ్బా నుండి పాము తల బయటకు వచ్చిన తర్వాత, నిపుణులు దాని నోటిని పట్టుకుని ఎవరినీ కాటు వేయకుండా పూర్తిగా టిన్ ను తీసి వేశారు.