ఇటుక బట్టీ నిర్వాహకుడికి దొరికిన వజ్రం.. ఎంతకు అమ్ముడుపోయిందంటే..

26.11-carat diamond, found by brick kiln operator in Panna. ఇటీవల మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన వేలం పాటలో పన్నాలో ఇటుక బట్టీ నిర్వాహకుడికి

By Medi Samrat  Published on  28 Feb 2022 12:07 PM IST
ఇటుక బట్టీ నిర్వాహకుడికి దొరికిన వజ్రం.. ఎంతకు అమ్ముడుపోయిందంటే..

ఇటీవల మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన వేలం పాటలో పన్నాలో ఇటుక బట్టీ నిర్వాహకుడికి దొరికిన 26.11 క్యారెట్ల వజ్రం రూ. 1.62 కోట్లకు విక్రయించడం విశేషం. మరో 87 వజ్రాలు మొత్తం రూ. 1.89 కోట్లు పలికాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'డైమండ్ సిటీ' పన్నాలో ఫిబ్రవరి 24, 25 తేదీల్లో వేలం నిర్వహించారు. తొలిరోజు ఏకంగా 82.45 క్యారెట్ల బరువున్న 36 వజ్రాలు రూ.1.65 కోట్లకు విక్రయించినట్లు పన్నా జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. అంతేకాకుండా 78.35 క్యారెట్ల బరువున్న 52 వజ్రాలు రెండో రోజు రూ.1.86 కోట్లు పలికాయి.

వేలంలో అత్యధికంగా రూ.1.62 కోట్లకు 26.11 క్యారెట్ల వజ్రం అమ్ముడు పోయిందని తెలిపారు. ఇది ఫిబ్రవరి 21న ఇక్కడి గనిలో లభ్యమైందని అధికారి తెలిపారు. ఈ విలువైన వజ్రానికి వేలం క్యారెట్‌కు రూ.3 లక్షల నుంచి ప్రారంభమై రూ.6.22 లక్షలకు చేరిందని, చాలా కాలం తర్వాత ఇంత పెద్ద వజ్రం పన్నాలో లభించిందని చెప్పారు. కృష్ణ కళ్యాణ్‌పూర్ ప్రాంతంలో చిన్న తరహా ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న సుశీల్ శుక్లా కనుగొన్న ఈ వజ్రాన్ని స్థానిక వ్యాపారి కొనుగోలు చేశాడు. ప్రభుత్వ రాయల్టీ, పన్నుల తగ్గింపు తర్వాత ఆదాయం ఆ వ్యక్తికి ఇవ్వబడుతుంది. పన్నా జిల్లాలో 12 లక్షల క్యారెట్ల విలువైన వజ్రాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.


Next Story