క్వారంటైన్ కేంద్రంలో యువ‌తి స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఆక‌తాయిలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 May 2020 11:30 AM GMT
క్వారంటైన్ కేంద్రంలో యువ‌తి స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఆక‌తాయిలు

ఆడ‌వారిపై జ‌రుగుతున్న అరాచ‌కాల ప‌ట్ల కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్నో చ‌ట్టాలు చేస్తున్న నేరాలు మాత్రం త‌గ్గ‌ట్లేదు. తాజాగా క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న యువతి (22)ని స్నానం చేస్తుండ‌గా వీడియో తీసిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో వెలుగుచూసింది.

వివ‌రాళ్లోకెళితే.. దమో జిల్లాకు చెందిన యువతి ఇండోర్‌ నుంచి తిరిగివస్తూ.. సాగర్‌ జిల్లాలోని కుమార్‌ భటోలి గ్రామంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన‌ క్వారంటైన్‌లో ఉంటుంది. ఆ యువతి క్వారంటైన్‌ కేంద్రం వెలుపల బాత్‌రూంలో స్నానం చేస్తుండగా.. వీడియో తీసిన ఆక‌తాయిలు.. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామని యువతిని బెదిరించసాగారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేపట్టామని జిల్లా పోలీస్‌ అధికారి రాజేష్‌ బంజారా తెలిపారు. ఆయ‌న మాట్లాడుతూ.. బాధిత యువతి క్వారంటైన్‌ కేంద్రం వెలుపల బాత్‌రూంలో స్నానం చేస్తుండగా నిందితులు వీడియో తీసి, ఆ క్లిప్‌ను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామని బెదిరించ సాగార‌ని.. యువ‌తి ఫిర్యాదు మేర‌కు నిందితుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామ‌న్నారు.

Next Story
Share it