ప్రధాన పూజారి దారుణం.. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌పై ప‌దే ప‌దే అత్యాచారం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 May 2020 5:06 AM GMT
ప్రధాన పూజారి దారుణం.. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌పై ప‌దే ప‌దే అత్యాచారం

క్ర‌మశిక్ష‌ణ‌కు మారుపేరైన అర్చ‌క‌ వృత్తికి క‌లంకం తెచ్చాడు ఓ ఆలయపూజారి. ఇద్దరు మహిళలను అక్రమంగా నిర్బంధించిన‌ ఆలయపూజారి వారిపై పదేపదే అత్యాచారం చేశాడు. వివ‌రాళ్లోకెళితే.. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్ నగరంలోని లోపోక్ పోలీసు స్టేషన్‌ పరిధిలో గ‌ల‌ గురు జ్ఞాన్‌నాథ్ ఆశ్రమ వాల్మీకి తీర్థ్ ప్రధాన పూజారిగా మహంత్ మోహన్ గిర్దారీనాథ్ విధులు నిర్వ‌హిస్తున్నాడు.

బాధిత మ‌హిళ‌లు పంజాబ్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు తర్సీంసింగ్ కు రాసిన లేఖలో.. ఆలయ పూజారి అయిన గిర్దారీనాథ్ తమను నిర్బంధించి పలుసార్లు అత్యాచారం చేశాడని పేర్కొన్నారు. తర్సీంసింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆలయం ఆవరణలోని ఆశ్రమం రహస్య స్థావరాలపై దాడి చేసిన డీఎస్పీ అటారీ గురు ప్రతాప్ సింగ్ బృందం ఆలయ ప్రధాన పూజారి , అతని సహచరుడు వరీందర్ నాథ్ లను అరెస్ట్ చేశారు.

పోలీసుల దాడి నేఫ‌థ్యంలో గిర్దారీనాథ్ అనుచరులు నాచత్తర్ సింగ్, సూరజ్ నాథ్ లు తప్పించుకుని పారిపోయారు. పారిపోయిన వారిని త్వరలో పట్టుకుంటామని.. ఆశ్రమంలో జ‌రి‌గిన అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై గిర్దారీనాథ్ తో పాటు అతని సహచరుడు వరీందర్ నాథ్ లను విచారిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.

Next Story
Share it