సృష్టికి విరుద్దంగా ఆ ఇద్ద‌రు ప్రేమించుకున్నారు.. కాద‌నేస‌రికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 May 2020 2:54 PM GMT
సృష్టికి విరుద్దంగా ఆ ఇద్ద‌రు ప్రేమించుకున్నారు.. కాద‌నేస‌రికి

సృష్టికి మూలం ప్రేమ‌. అది ఎప్పుడు ఎలా ఎవ‌రిపై ప‌డుతుందో చెప్ప‌లేం. సాధార‌ణంగా ఓ అమ్మాయి.. ఓ అమ్మాయి మ‌ధ్య ప్రేమ ప‌డుతుంది. కానీ ఇక్క‌డ ఇద్ద‌రు అమ్మాయిల మ‌ధ్య ప్రేమ పుట్టింది. ఆ ఇద్ద‌రిలో ఓ మ‌హిళ‌కు వివాహాం అయి ఓ బిడ్డ కూడా ఉన్నాడు. ఇక వీరి మ‌ధ్య బంధం ఇంట్లో వారికి తెలిసి ఇంకో యువ‌తికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి అయితే ఇద్ద‌రు క‌లుసుకోవడం కుద‌ర‌ద‌ని ఓ దారుణ నిర్ణ‌యం తీసుకున్నారు. ఒకే చీర‌కు ఇద్ద‌రు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. న‌మ్మ‌క్క‌ల్ జిల్లాలోని పురియ‌మ‌నాలి చెందిన ఓ మ‌హిళ‌(23) ఓ కంపెనీలో ప‌ని చేస్తోంది. అదే కంపెనీలో కొట్టాయ‌పాలానికి చెందిన ఓ యువ‌తి ‌(20) కూడా ప‌నిచేస్తోంది. మ‌హిళ‌కు మూడేళ్ల క్రిత‌మే వివాహం కాగా.. ఏడాదిన్న‌ర కుమారుడు ఉన్నాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మధ్య స్నేహం చిగురించింది. కాల‌క్ర‌మేణ స్నేహాం కాస్త ప్రేమ‌గా మారింది. అది కాస్త హ‌ద్దుల‌ను చెరిపివేస్తూ ఇద్ద‌రూ ఒక‌రికి ఒక‌రు ద‌గ్గ‌ర అయ్యారు. ఎంత‌లా అంటే ఒక‌రిని విడిచి మ‌రోక‌రు ఉండ‌లేనంత‌గా. ఓ వీరి వ్య‌వ‌హారం ఇరు కుటుంబాల‌కు తెలిసింది. ఆయా కుటుంబ స‌భ్యులు వారిని ప‌ద్ద‌తి మార్చుకోవాల‌ని హెచ్చ‌రించారు. ఇద్ద‌రు క‌ల‌వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

ఈ క్ర‌మంలో యువ‌తికి పెళ్లి చేయ‌డానికి నిశ్చ‌యించారు. మే 18న నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యువ‌తికి పెళ్లి అయితే.. ఇద్ద‌రు క‌లవ‌డం ఇక కుద‌ర‌ద‌ని, వారిద్ద‌రు క‌లిసి ఓ దారుణ నిర్ణ‌యానికి వ‌చ్చారు. త‌మ ప్రేమ‌ను కుటుంబాలు వ్య‌తిరేకించ‌డంతో ఇద్ద‌రూ ఒకే చీర‌కు ఉరి వేసుకుని ఆదివారం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని మృత‌దేహాల‌ను ప‌రిశీలించి పోస్టు మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Next Story
Share it