సృష్టికి విరుద్దంగా ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు.. కాదనేసరికి
By తోట వంశీ కుమార్ Published on 17 May 2020 2:54 PM GMTసృష్టికి మూలం ప్రేమ. అది ఎప్పుడు ఎలా ఎవరిపై పడుతుందో చెప్పలేం. సాధారణంగా ఓ అమ్మాయి.. ఓ అమ్మాయి మధ్య ప్రేమ పడుతుంది. కానీ ఇక్కడ ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ పుట్టింది. ఆ ఇద్దరిలో ఓ మహిళకు వివాహాం అయి ఓ బిడ్డ కూడా ఉన్నాడు. ఇక వీరి మధ్య బంధం ఇంట్లో వారికి తెలిసి ఇంకో యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి అయితే ఇద్దరు కలుసుకోవడం కుదరదని ఓ దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఒకే చీరకు ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. నమ్మక్కల్ జిల్లాలోని పురియమనాలి చెందిన ఓ మహిళ(23) ఓ కంపెనీలో పని చేస్తోంది. అదే కంపెనీలో కొట్టాయపాలానికి చెందిన ఓ యువతి (20) కూడా పనిచేస్తోంది. మహిళకు మూడేళ్ల క్రితమే వివాహం కాగా.. ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. కాలక్రమేణ స్నేహాం కాస్త ప్రేమగా మారింది. అది కాస్త హద్దులను చెరిపివేస్తూ ఇద్దరూ ఒకరికి ఒకరు దగ్గర అయ్యారు. ఎంతలా అంటే ఒకరిని విడిచి మరోకరు ఉండలేనంతగా. ఓ వీరి వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలిసింది. ఆయా కుటుంబ సభ్యులు వారిని పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఇద్దరు కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ క్రమంలో యువతికి పెళ్లి చేయడానికి నిశ్చయించారు. మే 18న నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యువతికి పెళ్లి అయితే.. ఇద్దరు కలవడం ఇక కుదరదని, వారిద్దరు కలిసి ఓ దారుణ నిర్ణయానికి వచ్చారు. తమ ప్రేమను కుటుంబాలు వ్యతిరేకించడంతో ఇద్దరూ ఒకే చీరకు ఉరి వేసుకుని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.