న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  25 July 2020 10:00 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

అక్కడ ఆగస్టు 31 వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌

దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకు తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి అన్ని దేశాలకు విస్తరించింది. ఈ వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌లేని కారణంగా దేశాలను సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక బెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలోని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. దేశంలో తొలిసారి

దేశంలో తొలిసారిగా తెలంగాణ రవాణా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో వాహనదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి. అసలు వాహనదారులు లైసెన్స్ తీసుకోవాలన్నా.. రెన్యూవల్ చేసుకోవాలన్నా.. వాహనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిందే. అందులో ఎన్నో ఇబ్బందులు. వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆర్టీఏ కార్యాలయంలోకి వెళ్లగా, ప్రతిదానికో రేటు. దళారులను ఆశ్రయిస్తున్న వాహనదారులకు చెబుకు చిల్లు పడాల్సిందే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కేసులు భారీగా పెరుగుతున్న వేళ.. ఉపశమనం అదొక్కటే

24 గంటల వ్యవధిలో కరోనా కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లోని తెలంగాణలో కొత్త కేసుల నమోదు విషయంలో కాస్త ఫర్లేదు కానీ.. ఏపీ పరిస్థితి మాత్రం అనూహ్యంగా మారింది. ఇక.. పలు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. కొద్ది రోజుల క్రితం రోజుకు పదివేల కేసులు నమోదు అవుతున్నాయన్నంతే గుండెలు అదిరేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా నలభైవేల వరకు కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో.. రానున్న కొద్ది రోజుల్లో రోజుకు లక్ష కేసులు నమోదయ్యే ..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బీజేపీ పెద్దాయనకు ఎంత కష్టం.. 4.30 గంటలు.. వంద ప్రశ్నలు

బీజేపీ కురువృద్ధుడుగా అందరికి సుపరిచితుడైన ఎల్ కే అద్వానీ ప్రత్యేక పరిస్థితిని తాజాగా ఎదుర్కొన్నారు. అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేసిన కేసుకు సంబంధించిన విచారణకు ఆయన హాజరయ్యారు. 92 ఏళ్ల వయసులో ఆయన్ను అప్పుడెప్పుడో 28 ఏళ్ల క్రితం జరిగిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. నాలుగున్నర గంటల పాటు విచారణ చేయటం గమనార్హం. తాజాగా జరిపిన సీబీఐ విచారణలో ఏకంగా వంద ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా తెలుస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వాయించేసిన కాయ‌గూర‌ల‌మ్మి.. ఇంగ్లీష్‌లో అన‌ర్గ‌ళంగా మాట్లాడ్డంతో అధికారులు షాక్!

రోడ్డు ప‌క్క‌న తోపుడు బ‌ళ్ళ‌పై కాయ‌గూర‌లు, పండ్లు అమ్ముకుంటున్న బ‌డుగుజీవుల‌పై మునిసిప‌ల్ అధికారులు కొర‌డా ఝ‌ళిపించారు. ఎన్నిసార్లు చెప్పాలి రోడ్డు పై మీ కొట్టు తెర‌వొద్ద‌ని.. ట్రాఫిక్ కు ఇబ్బంది అవుతుంద‌ని ఏం పిచ్చ‌పిచ్చ‌గా ఉందా అంటూ చెడామ‌డా తిడుతూ ఓ తోపుడు బండిని ప‌క్క‌కు తోసేశారు. ఈ బండి తాలూకు యువ‌తికి ఎక్క‌డ్లేని కోపం ముంచు కొచ్చింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

డిజిటల్‌ ప్రపంచంపై సుకుమార్‌ కన్ను..?

టాలీవుడ్‌లో టాలెంట్‌ ఉన్న యంగ్‌ ఎనర్జటిక్‌ దర్శకుడు సుకుమార్‌ తీసే ప్రతి సినిమా ఓ ప్రయోగమే! ఆర్య, 100 పర్సెంట్‌ లవ్, ఒక్కడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం లాంటి బ్లాక్‌ బ్లస్టర్‌ హిట్‌లు తన ఖాతాలో ఉన్నాయి. సుకుమార్‌తో సినిమా ఓ కొత్త అనుభూతి అని స్టార్‌ నటులే అంగీకరిస్తారు. ఈ లెక్కల మాస్టారు ప్రతి సినిమాకు ఓ లెక్క.. ఓ విధానం ఉంటుంది. తను ఏ నిర్ణయం తీసుకున్నా క్యాలిక్యులేటెడ్‌గానే ఉంటుందన్నది వాస్తవం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఐపీఎల్‌లో ధోని విఫలమైతే..? డీన్‌జోన్స్‌ ఏమన్నాడంటే..?

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పలు టోర్నీలు వాయిదా పడగా.. కనీసం ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ను అన్నా చూద్దామని అనుకున్నారు క్రికెట్‌ ప్రేమికులు. కాగా.. టీ20 ప్రపంచ కప్‌ను వాయిదా వేయడంతో అభిమానులు నిరాశకు గురైయ్యారు. అయితే.. నిరవధిక లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఇండియన్‌ ప్రీమయర్‌ లీగ్‌(ఐపీఎల్) సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానుందని బీసీసీఐ తెలపడంతో.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

యూపీలో మరో క్రిమినల్ ఎన్‌కౌంటర్‌

ఉత్తరప్రదేశ్‌లో క్రిమినల్స్‌ గాలింపు కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ ను అరెస్టు చేసేందుకు స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ రంగంలోకి దిగింది. ఇటీవల మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబేతో పాటు అతని అనుచరులను సైతం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇతర క్రిమినల్స్‌ తప్పించుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. తాజాగా శనివారం బారా బంకీ ప్రాంతంలో టింకు కపాలా అనే క్రిమినల్ ‌ ను హతమార్చారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

ఏపీలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజటివ్‌ పెరుగుతున్న నేపథ్యంలో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి సర్కార్ ఎన్ని చర్యలు చేపట్టినా ఏమాత్రం తగ్గడం లేదు. గత వారం రోజులుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదువుతున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే పలు నగరాలు స్వచ్చంధంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తుండగా,.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నాగశౌర్య ప్రీ లుక్‌ అదరిపోయింది

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య తన లుక్‌ను మార్చేశాడు. తన కొత్త చిత్రం ఫస్ట్‌లుక్‌ తేదీని ప్రకటించాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. సుబ్రమణ్యపురం దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శౌర్య సరసన కేతిక శర్మ నటిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఈనెల 27 న విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూనే నాగశౌర్య తన ఫ్రీ లుక్‌ను విడుదల చేశాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story