అక్కడ ఆగస్టు 31 వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌

By సుభాష్  Published on  25 July 2020 2:30 AM GMT
అక్కడ ఆగస్టు 31 వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌

దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకు తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి అన్ని దేశాలకు విస్తరించింది. ఈ వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌లేని కారణంగా దేశాలను సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక బెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో వారంలో రెండు రోజుల పాటు ఆగస్టు 31 వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించిన అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర సేవలు మినహా అన్ని ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, ప్రైవేటు రవాణా తదితర సేవలన్ని నిలిచిపోనున్నారు.

ఇక నిన్న ఒక్క రోజు కొత్తగా 49,310 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 740 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,87,945కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 30,061 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 8,17,209 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 4,40,135 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 63.18శాతంగా ఉంది. దేశంలో మొత్తం 1,54,28,170 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,52,801 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో 41లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 12లక్షల కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. ఇక అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 6వ స్థానానికి చేరింది

Next Story
Share it