1. అవి గాలి వార్తలు..: మంత్రి ఈటల

హైదరాబాద్ : తాను పార్టీ మారుతున్నానన్న వార్తలను టీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఖండించారు. అవన్నీ పనిలేని వాళ్లు చేసే ప్రచారమన్నారు. అవి గాలి వార్తలంటూ మంత్రి రాజేందర్‌ కొట్టిపారేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

2. వచ్చే నెల 9 నుంచి ఏపీ శీతాకాల సమావేశాలు..!

అమరావతి: వచ్చే నెల 9 నుంచి ఏపీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.అదే రోజే బీఏసీ సమావేశం జరగనుంది. 10 నుంచి 12 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉంది. ఇసుక పాలసీ తో పాటు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఇసుక పాలసీ పై ఏపీ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చే అవకాశముంది. ఈ నెల 27 న జరిగే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చ నిర్వహించనున్నారు. ప్రతిపక్షాల మతపరమైన విమర్శలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…

3. ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ టీజ‌ర్ టాక్ అదిరింది

సూపర్ స్టార్ మహేష్ బాబు – స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ . అనిల్ సుంక‌ర‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ మూవీ టీజ‌ర్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూసారు. ఆఖ‌రికి ఈ రోజు టీజ‌ర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…

4. మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ థాకరే..!

మహా’ ప్రతిష్టంభన తొలగిపోయింది. దాదాపు నెల రోజుల రాజకీయ డ్రామాకు తెర పడింది. దశాబ్దాలుగా శివసేన కంటున్న కలలు నిజమయ్యాయి. బీజేపీకి తోక పార్టీగా ఎన్నాళ్లు అని ప్రశ్నించుకునే శివసైనికులకు కొన్ని దశాబ్దాలు తరువాత సమాధానం దొరికింది. బాలా సాహెబ్ థాకరే రూపంలో చిన్న ఏరులా ప్రారంభమైన శివసేన ఇప్పుడు మహానదై సీఎం పీఠం మీద తన ఆదిపత్యాన్ని ప్రదర్శించనుంది. 27 జులై 1960లో జన్మించిన 59 ఏళ్ల ఉద్దవ్ థాకరే మహారాష్ట్ర సీఎం పీఠంపై కూర్చుని ఇక నిర్ణయాలు తీసుకోనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…

5. ‘పింక్‌బాల్’ జోరు.. బంగ్లా బేజారు..!

టీమిండియా – బంగ్లాదేశ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జరుగుతున్న డే-నైట్ టెస్టులో బంగ్లా బ్యాట్స్‌మెన్ 106 పరుగులకే చేతులెత్తేశారు. టీమిండియా బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, షమీలు బంగ్లా బ్యాట్స్‌మెన్‌కు ప‌దునైన బంతుల‌తో చుక్కలు చూపించారు. బంగ్లా ఒకానొక సమయంలో 100 పరుగుల లోపే ఆలౌట్ అవుతుందని అనుకున్నారు. అయితే, అతి కష్టం మీద 106 పరుగులు చేయగలిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…

6. 21 ఏళ్ల‌కే ఆ జైపూర్ కుర్రాడు ‘జ‌డ్జి’ అయ్యాడు.. ఎలా..?

చిన్న‌ వయస్సులోనే జడ్జిగా ఎంపికై మయాంక్‌ ప్రతాప్‌ సింగ్‌ చరిత్ర సృష్టించాడు. వివ‌రాళ్లోకెళితే.. రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన మ‌యాంక్.. 21 ఏళ్ల వయస్సులోనే జడ్జిగా ఎంపికై ఈ అరుదైన ఘనత సాధించాడు. జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసేందుకు కనీస వయస్సును 23 సంవత్సరాల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తూ రాజస్తాన్‌ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో ఎల్‌ఎల్‌బీ ఫైనల్‌ ఇయర్ చ‌దువుతున్న మ‌యాంక్‌కు ఈ అవ‌కాశం ద‌క్కింది. ఈ నేఫ‌థ్యంలో రాజస్తాన్‌ జుడిషియల్‌ సర్వీస్‌- 2018 పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన మయాంక్ అతిపిన్న వ‌య‌స్సులో జ‌డ్జి అయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…

7. ‘జార్జి రెడ్డి’ రివ్యూ

దురహంకారపూరిత జాతీయవాదం, పోస్ట్ ట్రూత్ పాలిటిక్స్ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఒక విస్మృత విప్లవకారుడి జీవితాన్ని తెరకెక్కించడం నిజంగా దుస్సాహసమే. సెన్సార్ కోతలు, దక్షిణ పక్ష కార్పణ్యాలు, నిషేధ భీతి వంటి అడ్డంకులన్నిటినీ దాటేందుకు దర్శకుడు కొంత సర్దుబాట్లు చేయక తప్పలేదు. మత దురహంకారంపై, అగ్రవర్ణ ఆధిపత్య భావజాలంపై, క్యాంపస్ గూండాయిజం, అత్యాచారాల పర్వం పై జార్జి రెడ్డి చేసిన పోరాటపు తీవ్రతను తగ్గించేందుకు దర్శకుడు చాలా ప్రయత్నమే చేశాడని చెప్పాలి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…

8. ర‌జ‌నీకాంత్ స్టేట్ మెంట్ – త‌మిళ రాజ‌కీయాల్లో సెన్సేష‌న్..!

సూపర్ స్టార్ రజ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రానున్నార‌ని గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ.. ర‌జ‌నీ మాత్రం త‌న నిర్ణ‌యాన్ని స్ప‌ష్టంగా తెలియ‌చేయ‌లేదు. ఇటీవ‌ల క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయాల్లోకి రావ‌డం.. ర‌జ‌నీకాంత్ కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డం తెలిసిందే. దీంతో ర‌జ‌నీ రాజ‌కీయ ప్ర‌వేశం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఇటీవల ర‌జ‌నీకాంత్ మీడియాకు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అది ఏంటంటే… 2021లో తమిళ ప్రజలు అద్భుతం చూస్తారని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…

9. ఆయన నారా బాబు కాదు యూ టర్న్‌ బాబు..!

అమరావతి: చంద్రబాబు తాను నమ్మిన సిద్దాంతం నుంచి కూడా యూ టర్న్ తీసుకుంటాడంటూ మండిపడ్డారు మంత్రి పేర్ని నాని. చంద్రబాబు లాగే లోకేష్ కూడా యూ టర్న్ కు అలవాటు పడ్డారని ఎద్దేశా చేశారు. యూ టర్న్‌లు తీసుకోవడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. ఎన్టీఆర్ టీడీపీ పట్టినప్పుడు బంగాళాఖాతంలో కలుపుతానని చంద్రబాబు ప్రగల్బాలు పలికారన్నారు. తరువాత యూ టర్న్‌ తీసుకుని చంద్రబాబు పంచన చేరారని ఎద్దేవా చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకొనని చెప్పి ..యూ టర్న్ తీసుకొని చంద్రబాబు మళ్లీ పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…

10. ఈ రహీంలకు రాముడి “మందిరమే” ఆకలి తీరుస్తుంది!!

ఆయన మతం ఇస్లాం. కానీ ఉద్యోగం చెక్కతో చేసిన దేవ మందిరాలకు పాలిష్ చేయడం. పేరు షేక్ రంజాన్. కానీ పని మాత్రం హిందువులంత శ్రద్ధతో మందిరం నమూనాలను తయారు చేయడం. ఇళ్లలో పెట్టుకునే దేవతా మందిరాల తయారీ అతని ప్రత్యేకత. అయిదుసార్లు నమాజ్ చేస్తాడో లేదో తెలియదు కానీ రోజు రోజంతా దేవాలయాలను తయారు చేయడంలోనే గడిపేస్తాడు షేక్ రంజాన్. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.