ముఖ్యాంశాలు

  • వచ్చే నెల 9 నుంచి ఏపీ శీతాకాల సమావేశాలు
  • అదే రోజే బీఏసీ సమావేశం
  • మతపరమైన విమర్శలపై ఏపీ ప్రభుత్వం సీరియస్

అమరావతి: వచ్చే నెల 9 నుంచి ఏపీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.అదే రోజే బీఏసీ సమావేశం జరగనుంది. 10 నుంచి 12 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉంది. ఇసుక పాలసీ తో పాటు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఇసుక పాలసీ పై ఏపీ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చే అవకాశముంది. ఈ నెల 27 న జరిగే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చ నిర్వహించనున్నారు. ప్రతిపక్షాల మతపరమైన విమర్శలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.