ముఖ్యాంశాలు

  • 21 ఏళ్ల వయస్సులోనే జడ్జిగా మయాంక్‌ ప్రతాప్‌ సింగ్‌
  • జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ వయస్సు త‌గ్గింపుతో అవ‌కాశం
  • పైన‌లియ‌ర్‌లోనే జ‌డ్జిగా అవ‌కాశం

చిన్న‌ వయస్సులోనే జడ్జిగా ఎంపికై మయాంక్‌ ప్రతాప్‌ సింగ్‌ చరిత్ర సృష్టించాడు. వివ‌రాళ్లోకెళితే.. రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన మ‌యాంక్.. 21 ఏళ్ల వయస్సులోనే జడ్జిగా ఎంపికై ఈ అరుదైన ఘనత సాధించాడు. జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసేందుకు కనీస వయస్సును 23 సంవత్సరాల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తూ రాజస్తాన్‌ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో ఎల్‌ఎల్‌బీ ఫైనల్‌ ఇయర్ చ‌దువుతున్న మ‌యాంక్‌కు ఈ అవ‌కాశం ద‌క్కింది. ఈ నేఫ‌థ్యంలో రాజస్తాన్‌ జుడిషియల్‌ సర్వీస్‌- 2018 పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన మయాంక్ అతిపిన్న వ‌య‌స్సులో జ‌డ్జి అయ్యాడు.

ఈ సంధ‌ర్బంగా మీడియాతో మాట్లాడిన మ‌యాంక్.. 2014లో ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో జాయిన్‌ అయ్యాను. రాజస్తాన్‌ యూనివర్సిటీ నుంచి ఈ ఏడాది పట్టా పొందాను. జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో నా కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల కృషి ఎంతగానో ఉంది. వారందరికీ నా ధన్యవాదాలు. తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించినందుకు గర్వంగా ఉందని అన్నాడు.

ఇక‌పోతే.. రాజస్తాన్‌ హైకోర్టు జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ కనీస వయసు అర్హతను తగ్గించడంతోనే ఇది సాధ్యమైందని మ‌యాంక్ అన్నాడు. చిన్న వయస్సులోనే జడ్జిగా కెరీర్‌ ఆరంభిస్తున్న కారణంగా సుదీర్ఘ కాలం స‌మాజ‌ సేవ చేసే భాగ్యం నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది అని మయాంక్ తెలిపాడు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.