న్యూస్‌మీటర్.. టాప్ 10 న్యూస్
By Medi Samrat Published on 20 Nov 2019 6:03 PM IST1. పైకి రైతు సంక్షేమం..లోపల ‘మహా’ రాజకీయం..!
ఢిల్లీ: మరాఠా యోధుడు, రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మహారాష్ట్ర రాజకీయాలు చిందరవందరగా ఉన్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత చేకూరింది. పైకి మాత్రం మహారాష్ట్ర రైతుల సమస్యలను మోదీ పవార్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి లేఖ కూడా ఇచ్చారని వార్తలు వచ్చాయి. మోదీ – పవార్ సమావేశానికి అమిత్ షా కూడా హాజరయ్యారు. అయితే..అమిత్ షా మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర సంక్షేమం, అభివృద్ది గురించి వీరిద్దరూ లోతుగా చర్చించారా? రాజకీయాల గురించి లోతుగా చర్చించారా?. పవార్ భవిష్యత్ గురించి లోతుగా చర్చించారా ? అనేది బయటకు రావాల్సి ఉంది. మోదీకి పవార్ లేఖ ఇచ్చారని చెబుతున్నప్పటికీ.. లేఖలో ఏముందీ అనేది మోదీ – పవార్‌లకు తప్పితే వేరేవారికి తెలియదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
2. టాలీవుడ్‌లో కాకరేపుతోన్న ‘ఐటీ రైడ్స్’…!
ఈ రోజు ఉదయం టాలీవుడ్ సంచలన వార్తతో మేల్కొంది. తెలుగు సినీ ప్రముఖులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల దాడులతో కళ్లు తెరిచింది. ఏకకాలంలో.. పలు నగరాల్లో నిర్మాతలు, అగ్ర హీరోల ఇళ్లు, వారి బంధువుల ఇళ్లు, కార్యాలయాలలో ఐటీ శాఖ అధికారులు దాడులతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
3. నిన్ను జట్టులోకి తీసుకుంటాం.. అందుకే అతన్ని వదులుకున్నాం.!
కేకేఆర్ ఐపీఎల్ 2020 సీజన్ వేలంలోకి ఆ జట్టు స్టార్ హిట్టర్ క్రిస్‌లిన్‌ను విడిచిపెట్టడంపై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ స్పందించిన విషయం తెలిసిందే. అయితే.. యువీ విమర్శలపై కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ కౌంటర్ ఇచ్చాడు. ‘యువీ మేం హిట్టర్ క్రిస్ లిన్‌ను వదిలిపెట్టాం… కానీ.. కేకేఆర్ వేలంలో నిన్ను తీసుకోవడానికి బిడ్ వేయవచ్చు! మీ ఇద్దరి (లిన్, యువీ) పై ప్రేమ, గౌరవం ఎప్పటికీ ఉంటుంది’ అంటూ ట్వీట్ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
4. ఏపీలో ఆ గ్రామం ఇప్పుడు ప్రపంచానికే రోల్ మోడల్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చోడవరం గ్రామం అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందింది. మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో అందించాల్సిన సేవల గురించి అధ్యయనం చేయడానికి 19 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. డిఆర్డీయే, జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నడిచే ఈ గ్రామ సచివాలయం ఇకపై రికార్డులకు వేదికగా నిలవబోతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
5. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సెకండ్ ట్రైలర్‌లో ఏముంది..?
సంచలన దర్శకుడు వర్మ తీస్తున్న చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. ఏపీ రాజకీయాల చుట్టూ ఈ సినిమా కథ తిరగనుంది. ఇప్పటికే ట్రైలర్ వన్ రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది. రెండో ట్రైలర్ ఈ రోజు విడుదల చేశాడు వర్మ. రాజకీయాలే పరమావధిగా బతికే ఇద్దరు నాయకులు చుట్టూ వర్మ కథ రాసుకున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
6. పవన్ కళ్యాణ్.. రజినీకాంత్.. వెంకటేష్ లకు.. ‘సూపర్‌స్టార్ కృష్ణ’ ఛాలెంజ్..!
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్, మనం సైతం కన్వినర్ కాదంబరి కిరణ్ పాల్గొన్నారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ హీరోలు పవన్ కళ్యాణ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, హీరో వెంకటేష్ లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
7. సానుకూల వాతావరణం సృష్టిస్తే విధుల్లో చేరుతాం
ప్రభుత్వం సానుకూల వాతావరణం ఏర్పాటు చేస్తే సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. దీనికి సంబంధించి లేఖ కూడా విడుదల చేశారు. అయితే..”కార్మికులపై ఎలాంటి షరతులు లేకుండా విధులు నిర్వర్తించడానికి అనుకూల వాతావరణం కల్పించాలని జేఏసీ నేతలు కోరారు.
అప్పుడే సమ్మె విరమించిన కార్మికులు విధుల్లో చేరతారని” లేఖలో జేఏసీ నేతలు స్పష్టం చేశారు. సమ్మెకు ముందున్న పరిస్థితులు కల్పించాలని జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
8. వాతావరణంలో తీవ్రస్థాయి మార్పులు..!
హైదరాబాద్ : 2019లో భారత్ ను ముంచెత్తిన వరదలు పెను విలయాన్ని సృష్టించాయి. మునుపెన్నడూ లేనంత నష్టాన్ని దేశం ఈసారి వరదల కారణంగా చవిచూడాల్సి వచ్చింది. ప్రాణనష్టం, పశునష్టం మాత్రమే కాక లక్షల ఎకరాల పంటపొలాలు ఇసుక మేటవేసి బీడు భూములుగా మారాయి. ఈ పెను విలయానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
9. కాకినాడ తీరంలో ఇండో-అమెరికా సైనిక విన్యాసాలు..!
ఆంధ్రప్రదేశ్ సాగర తీరాన సైనిక విన్యాసాలను భారత్, అమెరికా ఉత్సహంగా నిర్వహిస్తున్నాయి. ఓ వైపు యుద్ధ ట్యాంకులు, మరో వైపు త్రివిధ దళాల ట్రూపులు మోహరించాయి. ఈ విన్యాసాలను భారత్, అమెరికా త్రివిధ దళాలు ‘టైగర్ ట్రయాంఫ్’ (పులి విజయం) పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, కాకినాడలోని బీచ్ నేవల్ ఎన్‌క్లేవ్‌లో నిర్వహిస్తున్నాయి.
ఈ క్రమంలో తీరంలోని ప్రత్యేక పటిష్టమైన బందోబస్తును ఏర్పాటును చేశారు. శుత్రువును మట్టికరిపిస్తూనే ఆయుధాలను రక్షించుకుంటూ సైనికులు విన్యాసాలు చేపట్టారు. సముద్రంలోని భూమి మీదకు వస్తూ ఒళ్లు గగుర్పుడిచేలా మెరైన్స్ స్టంట్స్ చేశారు. అదే సమయంలో హెలికాప్టర్ల నుంచి తాళ్ల సాయంతో సైనికులు వేగంగా కిందకు దిగుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
10. జేసీ బ్రదర్స్‌కి షాకిచ్చిన ముఖ్య అనుచరుడు..!
అనంతపురం జిల్లా టీడీపీ నేతలకు మరో షాక్ తగిలింది. జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న షబ్బీర్ అలీ అలియాస్ గోరా వైసీపీ కండువా కప్పుకున్నారు. బుధవారం తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో గోరాతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీలోకి వచ్చిన వారికి కండువా కప్పి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సాదరంగా ఆహ్వానించారు. జేసీ బ్రదర్స్‌కు ముఖ్య అనుచరుడైన గోరా.. గత కొన్ని రోజులుగా టీడీపీ కార్యాక్రమాలకు దూరంగా ఉంటున్నారు.ఇప్పుడు వైసీపీలో చేరిన గోరా.. జేసీ బ్రదర్స్‌కు పెద్ద షాక్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో జేసీ దివాకర్‌రెడ్డి ట్రావెల్స్‌కు చెందిన బస్సులను ఆర్టీఏఈ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..