గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్, మనం సైతం క‌న్విన‌ర్ కాదంబరి కిరణ్ పాల్గొన్నారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ హీరోలు పవన్ కళ్యాణ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, హీరో వెంకటేష్ లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

గ్రీన్ ఛాలెంజ్ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్.. సూపర్ స్టార్ కృష్ణను అభినందించారు. త్వరలోనే ఈ గ్రీన్ ఛాలెంజ్ ఉద్య‌మం ద్వారా 10 కోట్ల మార్కుకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి 3 మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించే బాధ్య‌త‌ను కూడా తీసుకోవాల‌ని సూపర్ స్టార్ కృష్ణ సూచించారు.

Whatsapp Image 2019 11 19 At 7.56.30 Pm Whatsapp Image 2019 11 19 At 7.56.31 Pm (1) Whatsapp Image 2019 11 19 At 7.56.31 Pm

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.