న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 27 Dec 2019 9:38 PM IST1. రాజధాని మార్పు ఖాయమే.. కానీ
ఎన్నివేల కోట్లు ఖర్చు చేసినా అమరావతిని అభివృద్ధి చేయలేమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధానిపై మంత్రులతో జరిగిన చర్చలో అన్నారు. అమరావతిని అభివృద్ధి చేసేందుకు ఖర్చు పెట్టో లక్షకోట్లలో 10 శాతం విశాఖపై పెడితే మరో హైదరాబాద్ గా మారుతుందన్నారు. రాజధాని మార్పుపై ప్రజలకు వివరిద్దామని సీఎం జగన్ మంత్రులతో చెప్పగా..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
2. ప్రియురాలు దూరం పెట్టిందని.. ఇంటిల్లిపాదిపై పెట్రోల్ పోసి..
వికారాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు పై ప్రియుడు పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అనంతరం తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అడ్డం వచ్చిన కుటుంబ సభ్యులపై కూడా పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటనలో ప్రియుడు ప్రియురాలుతో పాటు నలుగురు గాయపడ్డాడు. గాయపడ్డ నలుగురిని చికిత్స నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
3.‘మోదీ’ పెట్టుకున్న ‘కళ్లజోడు’ ఖరీదెంతో తెలుసా..?
దేశ ప్రధాని నరేంద్రమోదీ ఏది చేసిన ప్రత్యేకమే. ఆయన నిజ జీవితంలో ఓ బ్రాండ్‌ను అనుసరిస్తుంటారు. సూర్యగ్రహణం రోజు సోలార్ గ్లాస్‌కు బదులు సన్ గ్లాస్ పెట్టుకుని గ్రహనాన్నిచూడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురువారం చేసిన ఓ ట్వీట్ కూడా వైరల్‌గా మారింది. కాగా, ఆయన పెట్టుకున్న సన్ గ్లాస్ చూసిన తర్వాత చాలా మంది దాని బ్రాండ్ వెతికే పనిలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత కళ్లజోడు మేబ్యాచ్‌కు చెందినదని, ఆ కళ్లజోడు విలువ రూ.1.4 లక్షలు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
4. 2019ని వణికించిన ఘోరాలు, దారుణాలు
2019 యేడాది నేరాలు, ప్రమాదాలు తెలుగు రాష్ట్రాలను వణికించాయి. జాతీయ స్థాయిలోనే కాదు.. ఏకంగా అంతర్జాతీయ స్థాయి పత్రికల్లో పతాక శీర్షికల వార్తలకు కేంద్రబిందువులయ్యాయి. ప్రధానంగా అమ్మాయిలపై, పసికందులపై కామాంధుల రాక్షసత్వం, అమాయకులను బలి తీసుకున్న సంఘటనలు ప్రకంపనలు సృష్టించాయి. తెలుగు రాష్ట్రాలంటేనే భయం పుట్టే సంఘటనలు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
5. పాక్ నుంచి వచ్చాయి.. వణికిస్తున్నాయి
భారత్ సరిహద్దులోకి పాక్ నుంచి ఉగ్రవాదులే కాదు.. మిడతలు కూడా చొరబడుతున్నాయి. అడవుల్లో నుంచి వచ్చిన ఏనుగులు ఊర్లమీద, పంట పొలాల మీద దాడి చేయడం కూడా చూసి ఉంటారు. కానీ మిడతల దండు దాడి చేయడం మీరు ఎప్పుడైనా చూసారా. ఏదో తమిళ్ సినిమాలో చూసి ఉంటారు. అయితే అది క్రియేషన్ అని కొట్టి పడేసి ఉంటారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
6. ‘దక్కన్ క్రానికల్’ బెంగుళూర్ ఎడిషన్ మూసివేత..?
నష్టాలో ఊబిలో కూరుకుపోయిన దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) క్రమంగా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. కొద్ది రోజుల క్రితమే కేరళ కేంద్రంగా నడుపుతున్న కొచ్చి ఎడిషన్‌ను బంద్ చేసిన సంస్థ.. తాజాగా బెంగుళూరు ఎడిషన్‌ను కూడా మూసివేస్తునట్లు తెలుస్తుంది. ఈ మేరకు బెంగుళూర్ ఎడిషన్ వెలువడేది ఈ ఒక్క రేజే అని.. రేపటి నుండి బంద్ చేస్తున్నట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
7. ఎలా చేసినా సెంచరీ సెంచరీనే..!
టీమ్‌ఇండియా ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గురువారం తన సొంత అకాడమీలో యువ ఆటగాళ్లతో ముచ్చటించాడు. ఈ సందర్బంగా వారితో మాట్లాడుతూ పలు సూచనలు చేశాడు. ఆటగాడిగా ఎదిగే క్రమంలో షాట్ల ఎంపికలో పరిణితి సాధించడం కంటే.. అంతిమ ఫలితమే ముఖ్యమని ‘హిట్‌మ్యాన్’ తన అకాడమీ కుర్రాళ్లతో అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
8. అరె.. యాక్షన్ అంటేనే భయపడుతోన్న యాక్షన్ హీరో !
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ లో సడెన్ గా మార్పు వచ్చేసింది. మార్పు అంటే గెటప్ లో కాదు, మైండ్ సెట్ లో. నిజానికి యాక్షన్ తప్ప తనకు ఏది సెట్ అవ్వదని బలంగా నమ్మే గోపీచంద్ లో ఇప్పుడు యాక్షన్ అంటేనే నచ్చట్లేదట. ఓవర్ గా యాక్షన్ వద్దు అంటున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలో వెళ్తే.. గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ బేస్డ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
9. ప్రభాస్ పెళ్లిపై స్పందించిన పెద్దమ్మ..!
ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణంరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి మాట్లాడారు. ప్రభాస్ పెళ్లి గురించి వస్తున్న పుకార్లు విని చాలా నవ్వుకుంటున్నాం అన్నారు. మేము కూడా తన పెళ్లి గురించి ఆలోచిస్తున్నామని ప్రభాస్ ప్రస్తుతానికి ‘జాన్’ సినిమా చేస్తున్నాడు అది పూర్తీ అయినా తరువాత వివాహం చేసుకునే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా మాది పెద్ద కుటుంబం అందరితో కలిసిపోయే అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాము అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
10. ఆయన ఆర్నెళ్ల క్రితం వచ్చాడు.. మేం ఆయన చిన్న తనం నుంచే ఉద్యమిస్తున్నాం
ఏపీలో సీఎం జగన్ మూడు రాజధానులు ప్రకటించడంపై చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటనతో ప్రతిపక్షాలు ఆందోళనబాట పట్టాయి. మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఏపీలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై ఏపీ మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ మైసూరారెడ్డిని న్యూస్‌మీటర్ ఇంటర్వ్యూ చేయగా, పలు విషయాలను వెల్లడించారు. ఆయన మాటల్లోనే… పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…