ప్ర‌భాస్ పెళ్లిపై స్పందించిన పెద్ద‌మ్మ‌..!

By Newsmeter.Network  Published on  27 Dec 2019 2:50 PM GMT
ప్ర‌భాస్ పెళ్లిపై స్పందించిన పెద్ద‌మ్మ‌..!

ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణంరాజు భార్య‌, ప్ర‌భాస్ పెద్దమ్మ శ్యామలా దేవి మాట్లాడారు. ప్రభాస్ పెళ్లి గురించి వస్తున్న పుకార్లు విని చాలా నవ్వుకుంటున్నాం అన్నారు. మేము కూడా తన పెళ్లి గురించి ఆలోచిస్తున్నామని ప్రభాస్ ప్రస్తుతానికి 'జాన్' సినిమా చేస్తున్నాడు అది పూర్తీ అయినా తరువాత వివాహం చేసుకునే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా మాది పెద్ద కుటుంబం అందరితో కలిసిపోయే అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాము అన్నారు. 'జాన్' చిత్రం 2020 లో విడుదల అవుతుందని ఆ తరువాత ప్రభాస్ పెళ్లి జరిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

ప్రభాస్ నటించిన 'సాహో' అభిమానులను అలరించలేకపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న 'జాన్' అనే సినిమాలో నటిసున్నారు. తన తో పాటు హీరోయిన్ గా 'పూజాహెగ్డే' కనిపించనున్నారు. ప్రభాస్ 'జాన్' సినిమా విజయం అందుకొని పెళ్లి పీఠాలు ఎక్కాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

Next Story