ప్రియురాలు దూరం పెట్టింద‌ని.. ఇంటిల్లిపాదిపై పెట్రోల్ పోసి..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Dec 2019 9:24 AM GMT
ప్రియురాలు దూరం పెట్టింద‌ని.. ఇంటిల్లిపాదిపై పెట్రోల్ పోసి..

వికారాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు పై ప్రియుడు పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అనంత‌రం తాను ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డ్డాడు. అడ్డం వచ్చిన కుటుంబ సభ్యులపై కూడా పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘ‌ట‌న‌లో ప్రియుడు ప్రియురాలుతో పాటు నలుగురు గాయ‌ప‌డ్డాడు. గాయ‌పడ్డ న‌లుగురిని చికిత్స నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.

అయితే.. చికిత్స పొందుతూ ప్రియుడు ప్రియురాలు మృతిచెంద‌గా.. పెట్రోల్ దాడిలో గాయ‌ప‌డ్డ‌ ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. వివ‌రాళ్లోకెళితే.. గ‌త కొంత‌కాలంగా అంజమ్మ అనే మ‌హిళ‌తో నరసింహ అనే వ్య‌క్తి అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. కొన్ని రోజులుగా ప్రియురాలు అంజమ్మ దూరం పెట్టడంతో కోపం పెంచుకున్న నరసింహ.. ఇంటికి వెళ్లి కోపంతో అందరిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it