రేష్మీ అరెస్ట్‌.. అనాథ పిల్ల‌ల‌ను వ్య‌భిచార వృత్తిలోకి దింపి..!

By Newsmeter.Network  Published on  27 Dec 2019 7:30 AM GMT
రేష్మీ అరెస్ట్‌.. అనాథ పిల్ల‌ల‌ను వ్య‌భిచార వృత్తిలోకి దింపి..!

అనాథ పిల్ల‌ల‌ను వ్య‌భిచార రొంపిలోకి దింపుతున్న కిస్ ఆఫ్ ల‌వ్ యాక్టివిస్ట్ రేష్మీని కేర‌ళ పోలీసులు అరెస్టు చేశారు. గ‌తంలో చాలా సార్లు హోట‌ళ్ల‌లో వ్య‌భిచారం చేస్తూ ఈమె పోలీసుల‌కు అడ్డంగా ప‌ట్టుబ‌డింది. ఇంత‌కీ ఈ కిస్ ఆఫ్ ల‌వ్ మేట‌రేంటి..? ఈ యాక్టివిస్ట్ రేష్మీ సంగ‌తేంది..? వ‌ంటి వివ‌రాల‌పై ఓ లుక్కేద్దాం.

సాధార‌ణంగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి రోడ్డుపై నిల‌బ‌డి.. అది కూడా అంద‌రూ చూస్తుండ‌గా లిప్‌లాక్ కిస్సులు ఇస్తుంటే ఎవ‌రైనా ఏమంటారు..? ఒళ్లు కొవ్వెక్కిందా..? లేదా బ‌లుపెక్కిందా..? అని అంటాం. చాటుమాటుగా వెళ్లి ఇంట్లో చేసుకోవాల్సిన‌వి రోడ్ల‌మీద చేసుకుంటారా..? అంటూ చీవాట్లు పెడ‌తాం.

ఇలా అన్నందుకుగాను ఈ రేష్మీ కిస్ ఆఫ్ ల‌వ్ యాక్టివిస్ట్‌గా అవ‌తార‌మెత్తింది. తాను తీసుకున్న ఈ నినాదాన్ని ఉద్య‌మంగా రూపుదాల్చ‌డంలో విద్యార్థుల స‌హాయం కోరింది. అస‌లే ఉద్య‌మం పేరు కిస్ ఆఫ్ ల‌వ్‌. ఇటువంటి ఉద్య‌మానికి యువ‌త మ‌ద్ద‌తు తెల‌ప‌కుండా ఉండ‌గ‌ల‌రా..? ఉండ‌లేరు.

ఇక అప్ప‌ట్నుంచి ఈ కిస్ ఆఫ్ ల‌వ్ యాక్టివిస్ట్ రేష్మీ పేరు చెప్పుకుని రోడ్ల‌మీద‌కొచ్చి మ‌రీ ఎవ‌రిష్టాన వారు ముద్దులెట్టేసుకున్నారు. అంత‌కు ముందు వ‌ర‌కు విశ్వ విద్యాల‌యాల్లో సైతం అమ్మాయి.. అబ్బాయి క‌ల‌వాలంటే భ‌య‌ప‌డేవారు. కానీ, ఈ రేష్మీ పుణ్య‌మా అని బ‌హిరంగ ముద్దుల యుద్ధానికి దిగేశారు.

ఏ మాత్రం సిగ్గు, బిడియం లేకుండా రోడ్ల‌మీద‌కెళ్లి ముద్దులు పెట్టుకున్నారు. అలా ముద్దులు పెట్టుకోవ‌డ‌మ‌న్న‌ది దేశ ప్ర‌జ‌ల హ‌క్కు అన్న‌ట్టు విచిత్ర‌ ప్ర‌చారం చేశారు. యువ‌త ఇలా చేయ‌డానికి మూల కార‌ణం హ‌క్కుల కార్య‌క‌ర్త‌న‌ని చెప్పే ఈ రేష్మీ అనే ఆవిడే.

రేష్మీ ఇచ్చిన కిస్ ఆఫ్ ల‌వ్ నినాదానికి కేర‌ళ యువ‌త స్పందించింది. అస‌లే సోష‌ల్ మీడియా యుగం కావ‌డంతో ఈ ఉద్యమం విస్తృత స్థాయిలో ప్ర‌చారం జ‌రిగింది. ఏదేమైనా ఈ ఉద్య‌మం ద్వార అక్క‌డి అబ్బాయిలు కోరిక తీర్చుకున్నారు. మ‌రోప‌క్క‌, అమ్మాయిల‌ను ఉద్య‌మ‌కారిణులుగా రెచ్చ‌గొట్టి వాళ్ల తృప్తి తీర్చేసుకున్నారు. వాళ్లు కూడా మేము స‌మాజానికి కొత్త సందేశం ఇస్తున్నాం అన్న భావ‌న‌ను వ్య‌క్త ప‌రిచారు.

ఈ ఉద్య‌మం ఎంతవ‌ర‌కు వెళ్లిందంటే..? చివ‌ర‌కు అమ్మాయిల‌తో.. అమ్మాయిలే కాకుండా.., మ‌గాళ్లు.. మ‌గాళ్లు కూడా ముద్దులు పెట్టేసుకున్నారు. తమ హ‌క్కులు కాల‌రాస్తే తిరుగుబాటుత ప్ప‌ద‌ని, ముద్దు అన్న‌ది త‌మ‌ హ‌క్కు అన్న‌ట్టు వారు ఫీలైపోయారు.

కిస్ ఆఫ్ ల‌వ్ యాక్టివిస్ట్ రేష్మీని ఎందుకు అరెస్టు చేశారంటే..?

గ‌త కొంత కాలంగా కేర‌ళ పోలీసులు బిగ్ డాడి అన్న పేరుతో సీక్రెట్‌ ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే కిస్ ఆఫ్ ల‌వ్ యాక్టివిస్ట్‌గా ఉంటూ అనాథ పిల్ల‌ల‌ను చేర‌దీస్తున్న రేష్మీపై పోలీసులు ఓ క‌న్నేశారు. ఈ ఆప‌రేష‌న్‌లో సంచ‌ల‌న నిజాలు వెలుగు చూశాయి.

హ‌క్కుల కార్య‌క‌ర్త‌న‌ని చెప్పుకునే రేష్మీ అనాథ పిల్ల‌లను చేర‌దీసి.. వారిని నెమ్మ‌దిగా వ్య‌భిచార వృత్తిలోకి దించుతున్న‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. వారిని లైంగికంగా వాడుకుని భారీ మొత్తంలో డ‌బ్బులు కూడా సంపాదించిన విష‌యాన్ని పోలీసులు క‌నిపెట్టారు. ప్ర‌స్తుతం ఆమెను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు.

Next Story
Share it