న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  22 Jun 2020 11:21 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

మృత్యువు వెంటాడుతున్నా.. రోమాలు నిక్కబొడిచేలా సంతోష్ వీరోచిత పోరు

గల్వాన్ ఘటన.. యావత్ దేశాన్ని విషాదంలో ముంచేయటమే కాదు.. డ్రాగన్ దురాగతంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యేలా చేసింది. కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో ఇరవై మంది సైనికుల మరణానికి ముందు అసలేం జరిగింది? అన్న విషయంపై పెద్దగా స్పష్టత లేదు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కల్నల్‌ సంతోష్‌ కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్‌.. రూ.5 కోట్ల చెక్కు అందజేత

భారత్‌ – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అరుడైన కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. హైదరాబాద్‌ నుంచి సూర్యాపేటకు వెళ్లిన కేసీఆర్.. ఆయన‌ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రకటించిన రూ.5 కోట్ల సాయాన్ని చెక్కు రూపంలో అందించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భారత్ నుండి ఏది కూడా పొందే అర్హత చైనాకు లేదు

చైనా మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. భారత్ కు చెందిన భూభాగమైన గాల్వన్ లోయ కోసం చైనా తెగిస్తూ ఉండడం భారతీయులకు సహించడం లేదు. ఎల్.ఏ.సి. వద్ద చోటుచేసుకుంటున్న టెన్షన్స్ ను చూసి చైనా వస్తువుల వాడకాన్ని తగ్గించాలని.. అసలు వాడకూడదంటూ పెద్ద ఎత్తున పిలుపును ఇస్తున్నారు. పలువురు ప్రముఖులు చైనాకు వ్యతిరేకంగా పిలుపును ఇచ్చారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అరెస్ట్‌..

కోఠిలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ముట్టడికి యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ టెస్టుల సంఖ్య పెంచాలని బండి సంజయ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని అన్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏపీ ముఖ్యమంత్రికి పెరిగిన ప్రజామద్దతు.. ఏడాది పాలనపై సీపీఎస్‌ సర్వే

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ప్రజామద్దతు భారీగా పెరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా.. భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారు. ఏడాదిగా సీఎం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి తిరుగులేని మద్దతు లభిస్తోంది. కాగా, వైఎస్‌ జగన్‌ ఏడాది పాలనపై ‘సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌’ (సీసీఎస్‌) జూన్‌ 2 నుంచి 8వ తేదీ వరకూ ఏడాది పాలనపై రాష్ట్రంలో 13 జిల్లాలు, 44 నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఉగ్ర‌రూపం దాల్చిన క‌రోనా.. ఒక్కరోజే లక్షా80వేల కేసులు

కరోనా మ‌హ‌మ్మారి‌ రోజురోజుకీ మరింత విజృంబిస్తుంది. గ‌డిచిన‌ 24 గంటల వ్యవధిలో ఏకంగా లక్షా 83 వేల కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క రోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొద‌టిసారి. బ్రెజిల్‌లో అత్య‌ధికంగా 54,771 కేసులు న‌మోదుకాగా.. అమెరికాలో 36,617 కేసులు, భారత్‌లో 15,413 కేసులు నమోదయ్యాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రాకేష్ మాస్టర్ తో పోలుస్తున్నారు భయ్యా..!

సామాజిక మాధ్యమాల్లో విజయ్ దేవరకొండకు అభిమానులు ఎంత మంది ఉన్నారో.. ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా అంతేమందే ఉన్నారు. ఇప్పటికే మనోడిని ప్లే బాయ్ తో పోలుస్తూ తెగ పోస్టులు వెలుస్తూ ఉంటాయి. తాజాగా విజయ్ దేవరకొండ లుక్ చూసి అభిమానులే కాదు అందరూ షాక్ అయ్యారు. తన తండ్రి గోవర్ధన్ రావుతో, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో విజయ్ దేవరకొండ దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రెడీగా ఉన్నా.. ఎవరూ పిలవట్లేదన్న బ్యూటీ

తొలిసినిమాతోనే గుర్తింపు పొందే అదృష్టం అందరికి రాదు. అలాంటి అవకాశం చాలా కొద్దిమందికే సాధ్యం. పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీ చూపే కాదు.. సగటు ప్రేక్షకుడి మదిలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది రీతూవర్మ. చూసినంతనే మెడ్రన్ అమ్మాయిలా కనిపించే రీతూ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. మహమ్మారి భయం నేపథ్యంలో షూటింగ్.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

విద్యార్థుల ఇంటికే ‘మధ్యాహ్న భోజన’ బియ్యం

దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్నకరోనా ప్రభావం అంతా ఇంతా కాదు. దీని ప్రభావం అన్నిరంగాలతో పాటు విద్యాసంస్థలపై కూడా పడింది. అయితే కరోనా కాలరాస్తున్న నేపథ్యంలో కొత్త విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి. ఇక ప్రభుత్వ పాఠశాలలు మొదలైతే పేద విద్యార్థుల ఆకలి కూడా తీరేది. కరోనా వల్ల విద్యా సంస్థలు మూతపడటంతో మధ్యాహ్నభోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం భోజనానికి సంబంధించి బియ్యాన్ని విద్యార్థుల ఇళ్లకే పంపిణీ చే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వేముల‌వాడ‌లో గ్యాంగ్‌వార్‌

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన‌ విజయవాడ గ్యాంగ్ వార్ ఘటన మర‌వ‌క‌ముందే.. తాజాగా నిన్న‌ వేములవాడలో మ‌రో గ్యాంగ్ వార్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గొడ‌వ‌కు పెద్ద‌ కార‌ణం లేకుండానే యువకులు రెండు గ్యాంగ్‌లుగా విడిపోయి.. మండ‌ల ప‌రిష‌త్తు కార్యాల‌యం ఎదుట‌ న‌డిరోడ్డుపై‌ వీరంగం సృష్టించారు. వారి గొడ‌వ‌ చూసిన ప్రజలు భయంతో హ‌డ‌లిపోయారు. దాదాపుగా 20 నిముషాల పాటు యుద్ద‌భూమిని‌ తలపించిన వారి పోరును పోలీసులు చిత్రీకరించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story