బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అరెస్ట్‌..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Jun 2020 9:47 AM GMT
బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అరెస్ట్‌..

కోఠిలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ముట్టడికి యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ టెస్టుల సంఖ్య పెంచాలని బండి సంజయ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని అన్నారు.

అలాగే.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన సాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. అవసరమైన మేరకు కరోనా పరీక్షలు చేయటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ప్ర‌భుత్వాన్ని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు లక్షల సంఖ్యలో కరోనా పరీక్షలు చేస్తున్నారని, తెలంగాణలో మాత్రం కనీసం వేల సంఖ్యలో కూడా చేయట్లేదని ఫైర్ అయ్యారు.

Next Story