రాకేష్ మాస్టర్ తో పోలుస్తున్నారు భయ్యా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Jun 2020 7:49 AM GMT
రాకేష్ మాస్టర్ తో పోలుస్తున్నారు భయ్యా..!

సామాజిక మాధ్యమాల్లో విజయ్ దేవరకొండకు అభిమానులు ఎంత మంది ఉన్నారో.. ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా అంతేమందే ఉన్నారు. ఇప్పటికే మనోడిని ప్లే బాయ్ తో పోలుస్తూ తెగ పోస్టులు వెలుస్తూ ఉంటాయి. తాజాగా విజయ్ దేవరకొండ లుక్ చూసి అభిమానులే కాదు అందరూ షాక్ అయ్యారు. తన తండ్రి గోవర్ధన్ రావుతో, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో విజయ్ దేవరకొండ దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలను చూసి నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఏకంగా రాకేష్ మాస్టర్ తో పోలుస్తున్నారు. ఆయన బియర్డ్ స్టైల్ మీ స్టైల్ ఒకే రకంగా ఉంది భయ్యా.. కొంపతీసి ఆయన ఇంటర్వ్యూలు చూసి మీరు కూడా ఆయన ఫ్యాన్ అయిపోయారా అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఫ్రెంచ్ గెడ్డంతో, పూర్తీ జుట్టుతో ఉన్న విజయ్ దేవరకొండ ఫోటోలపై మీమ్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి.

ఈ లుక్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఫైటర్ కోసమా అని అడుగుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఫైటర్ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఛార్మీ స్పందించారు. స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయం, చేయాల్సిన అవ‌స‌రం కూడా లేదని తేల్చిచెప్పారు ఛార్మీ. ఫైట‌ర్ స్క్రిప్ట్ బ్లాక్ బ‌స్టర్ అని ఆమె ఎంతో నమ్మకంతో ఉన్నారు. క‌రోనా క్రైసిస్ ముగిసిన త‌ర్వాత షూటింగ్ ప్రారంభిస్తామని.. సినిమాపై చాలా న‌మ్మకంతో ఉన్నామని తెలిపింది. సినిమా మరో బ్లాక్ బస్టర్ అని తెలిపారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నటిస్తోంది.

Next Story