న్యూస్‌ మీటర్‌.. టాప్‌ 10 న్యూస్‌

By అంజి  Published on  19 Jan 2020 3:08 PM GMT
న్యూస్‌ మీటర్‌.. టాప్‌ 10 న్యూస్‌

1. 2 గంటలు వాట్సాప్‌ సేవలకు ఆటంకం.. యూజర్లు ఉక్కిరి బిక్కిరి

భారత్‌లో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయారు. దీంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారత్‌తో పాటు యూఏఈ, బ్రెజిల్‌ దేశాల్లో కూడా ఈ పరిస్థితి నెలకొంది. ఫొటోలు, వీడియోలు, పీడీఎఫ్‌ ఫైల్స్‌, జిప్‌ ఇమేజ్‌లు వాట్సప్‌ ద్వారా ఒక మొబైల్‌ నుండి ఇంకో మొబైల్‌కు వెళ్లకుండా ఆగిపోయాయి...పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

2. నాటి పొలిటికల్ హీరోలు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు..!

ఓడలు బండ్లయిపోతాయి. ఒకప్పుడు రాజ్యం చేసిన వారు సామాన్యులైపోతారు. కాలం కలిసిరాకపోతే కింగులు కూడా డంగైపోతారు. తెరాసలో ఇప్పుడు చాలా మంది సీనియర్ నాయకులకు ఇదే పరిస్థితి. ఒకప్పుడు కేసీఆర్ కు సన్నిహితులుగా పేరొంది, ఆయన ప్రశంసలు పొందిన వారు మనుగడ కోసం పోరాటం చేయాల్సి వస్తోంది...పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

3. సీఎం జగన్‌కు ఊరట లభించేనా.?

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు కొత్త సీబీఐ జాయింట్ డైరెక్టర్ ను నియమించింది. హైదరాబాద్‌ సీబీఐ జేడీగా గుజరాత్‌కు చెందిన మనోజ్‌ శశిధర్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి మనోజ్‌ శశిధర్‌ ముఖ్యమంత్రి జగన్‌ ఆస్తుల కేసును పర్యవేక్షించనున్నారు...పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

4. కౌంటర్‌ దాఖలు చేయండి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..!

హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నివాసంలో ఓయూ ప్రొఫెసర్‌ చింతకింది కాశీమ్‌ హెబియాస్‌ కార్పస్‌ పిటిషన్‌ పై విచారణ జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు కాశీమ్‌ను చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చైహాన్‌ ముందు గజ్వేల్‌ పోలీసులు హాజరుపర్చారు...పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

5. తాగి.. ఊగి.. తైతక్కలాడిన నలుగురు యువతులు

హైదరాబాద్‌లో పురుషులే కాదు .. మహిళలు సైతం ఫుల్లుగా మందు కొట్టి అడ్డంగా దొరికపోతున్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని ట్రాఫిక్‌ పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. మందు బాబులకు అడ్డూ.. అదుపు లేకుండా పోతోంది. అర్ధరాత్రి అయిందంటే చాలు ఫుల్లుగా మందుకొట్టి రోడ్లపై హంగామా సృష్టిస్తున్నారు...పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

6.షిర్డీ బంద్‌.. సాయి సంస్థాన్‌ ట్రస్ట్‌తో మహారాష్ట్ర ప్రభుత్వం చర్చలు.!

షిర్డీ: సాయి జన్మభూమి వివాదంపై మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కాస్తా వెనక్కు తగ్గినట్టుగా కనిపిస్తోంది. తాజాగా రేపు షిర్డీ సాయి సంస్థాన్‌ ట్రస్ట్‌తో మహారాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపేందుకు ఓకే చెప్పింది. ట్రస్ట్‌ సభ్యులను మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే చర్చలకు ఆహ్వానించారు...పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

7.ఈ సంక్రాంతి మర్చిపోలేని సంతోషాన్నిచ్చింది : మహేష్ బాబు

ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు రికార్డ్ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తన కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని, ఈ సంక్రాంతి తనకు జీవితంలో మరపురాని మధురమైన అనుభూతిని మిగిల్చిందని స్టారో హీరో మహేష్ బాబు చెబుతున్నాడు...పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

8.చెక్కు చెద‌ర‌ని ఆత్మ‌విశ్వాసానికి.. చేయూత‌

ఆ చిన్నారికి చిన్నప్పుడే కాళ్లు చచ్చుబడి పోయాయి. అయితే క్రికెట్ అంటే ఆ కుర్రాడికి ప్రాణం. తన లో ఉన్న లోపాన్ని ఆత్మవిశ్వాసంతో అధిగమించాడు. అంత చిన్న వయసులోనే ఎంతో పరిణితి చూపాడు. తన ఈడు పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ ఔరా.. అనిపిస్తున్నాడు...పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

9. స్టీవియా – ఒక స్వీట్ ఆల్టర్నేటివ్

హైదరాబాద్ కి చెందిన నాగజ్యోతికి అద్భుతాలు సాధించడమంటే చాలా ఇష్టం. తను ఎంచుకునే లక్ష్యాలు పూర్తిగా విభిన్నంగా ఉంటాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించడమంటే ఆమెకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆమె ఎంచుకున్న సమున్నతమైన లక్ష్యం ఏంటంటే భారతదేశానికి సుగర్ వ్యాధినుంచి పూర్తిగా విముక్తి కల్పించడం...పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

10.మైన‌ర్ బాలిక పై యువ‌కుడి అత్యాచారం.. అరెస్టు

వికారాబాద్ : మ‌హిళ‌ల పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. అత్యాచార దోషుల‌కు క‌ఠిన శిక్ష‌లు విధిస్తున్నా మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. తాజాగా ప‌రిగిలోపి బీసీ కాల‌నీలో అమానుష సంఘ‌టన చోటు చేసుకుంది...పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Next Story