2 గంటలు వాట్సాప్‌ సేవలకు ఆటంకం.. యూజర్లు ఉక్కిరి బిక్కిరి

By అంజి  Published on  19 Jan 2020 1:40 PM GMT
2 గంటలు వాట్సాప్‌ సేవలకు ఆటంకం.. యూజర్లు ఉక్కిరి బిక్కిరి

భారత్‌లో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయారు. దీంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారత్‌తో పాటు యూఏఈ, బ్రెజిల్‌ దేశాల్లో కూడా ఈ పరిస్థితి నెలకొంది. ఫొటోలు, వీడియోలు, పీడీఎఫ్‌ ఫైల్స్‌, జిప్‌ ఇమేజ్‌లు వాట్సప్‌ ద్వారా ఒక మొబైల్‌ నుండి ఇంకో మొబైల్‌కు వెళ్లకుండా ఆగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన వాట్సాప్‌ యాప్‌ నిర్వహకులు దాదాపు రెండు గంటల తర్వాత పునరుద్ధరించారు. భారత్‌ ఆదివారం సాయంత్రం ఈ సమస్య ఏర్పడింది. ఆండ్రాయిడ్‌తో మొబైల్స్‌తో ఆపటు, ఐవోఎస్‌ మొబైల్లలోనూ ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో ట్విట్టర్‌ వేదికగా కొందరు యూజర్లు వాట్సాప్ పని చేయడం లేదంటూ #whatsappdown హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేశారు. అయితే టెక్ట్స్‌ మేసేజ్‌లు మాత్రం యదావిధిగా కొనసాగాయి. ఈ సంవత్సరం మొదటి సారిగా వాట్సాప్‌ సేవలు నిలిచిపోయాయి. దీనిపై ఇప్పటికే పలువురు మీమ్స్‌ కూడా తయారు చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. వాట్సాప్‌ను ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేసుబుక్‌ నడిపిస్తోంది.Next Story