చెక్కు చెద‌ర‌ని ఆత్మ‌విశ్వాసానికి.. చేయూత‌

By Newsmeter.Network  Published on  19 Jan 2020 10:16 AM GMT
చెక్కు చెద‌ర‌ని ఆత్మ‌విశ్వాసానికి.. చేయూత‌

ఆ చిన్నారికి చిన్నప్పుడే కాళ్లు చచ్చుబడి పోయాయి. అయితే క్రికెట్ అంటే ఆ కుర్రాడికి ప్రాణం. తన లో ఉన్న లోపాన్ని ఆత్మవిశ్వాసంతో అధిగమించాడు. అంత చిన్న వయసులోనే ఎంతో పరిణితి చూపాడు. తన ఈడు పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ ఔరా.. అనిపిస్తున్నాడు. కాళ్లు చచ్చుబడిపోయినా ఒక చేత్తో బ్యాట్ పట్టుకుని మరో చేయి సాయంతో వికెట్ల మధ్య పరుగు తీస్తూ క్రికెట్పై ప్రేమని చూపుతున్న బస్తర్ కు చెందిన రామ్.. తన స్నేహితులతో క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను దిగ్గజ క్రికెట‌ర్‌ సచిన్ టెండ్కూర్ షేర్ చేసి రామ్ ని ప్రశంసించాడు. కొత్త ఏడాదిని స్ఫూర్తిమంతమైన వీడియోతో ప్రారంభించండని ట్వీట్ చేశాడు.

యువ క్రికెటర్లని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే సచిన్ టెండూల్కర్.. ఒంటిచేయి సాయంతో వికెట్ల మధ్య పరుగు తీస్తున్న 12 ఏళ్ల మద్దారామ్‌కి ఊహించని గిప్ట్ పంపించాడు. రాయ్‌పూర్‌లో జరుగుతున్న టోర్నీలో ప్రస్తుతం వీల్‌ఛైర్ ఫైనల్ మ్యాచ్‌లో రామ్ ఆడుతున్నాడు. అక్కడికి వెళ్లిన సచిన్ టెండూల్కర్ మేనేజర్ క్రికెట్ కిట్ తో పాటు ఓ లేఖని కూడా అందజేశాడు. అందులో రామ్ క్రికెట్ ఆడుతున్న విధానంపై ప్రశంసలు కురిపించిన సచిన్ స్నేహితులతో కలిసి ఇలానే క్రికెట్ ఆడాలని అభిలాషించాడు.



Next Story