న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  10 July 2020 11:22 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

అతిపెద్ద సోలార్‌ ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

అతిపెద్ద సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు భారత ప్రధాని నరేంద్రమోదీ. మధ్యప్రదేశ్‌లోని రేవాలో నిర్మించిన ఈ విద్యుత్‌ ప్లాంట్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ ప్రారంభించారు. ఈ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ 750 మెగావాట్లతో నిర్మించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఒక్క రనౌట్‌.. కోట్లాది మంది ఆశలు ఆవిరి.. ఏడాది పాటు క్రికెట్‌కు దూరం

అది 2019 జూలై 10. కోట్లాది మంది భారతీయులు టీవీలకు అతుక్కుపోయారు. ఒక్క రనౌట్‌తో వారి ఆశలు ఆవిరి అయిపోయాయి. అదే.. భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య సెమీఫైనల్‌ మ్యాచ్‌. వరుణుడు అడ్డంకి కలిగించడంతో రెండు రోజుల పాటు ఆ మ్యాచ్‌ జరిగింది. మొదటి బ్యాటింగ్‌ చేసిన కీవీస్‌ జట్టు 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. భారత జట్టు సునాయాసనంగా లక్ష్యాన్ని చేధింస్తుందని అంతా బావించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా

ఏపీలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏమాత్రం తగ్గడం లేదు. పుట్టిన పిల్లల వృద్దుల వరకు, అలాగే ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఇలా ఏ ఒక్కరిని వదలడంలేదు. తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా సోకినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్న అతనికి పరీక్షలు నిర్వహించగా, ఈ విషయం బయటకు వచ్చింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నిజామాబాద్‌ ఆస్పత్రిలో కరోనాతో నలుగురు మృతి.. విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్‌

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో కరోనా కాలరాస్తోంది. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు రోగులు మృతి చెందడంతో తీవ్ర కలకలం రేపుతోంది. నలుగురు కరోనా పేషంట్లు ఒకేసారి మరణించడంతో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిపై సమీక్షించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

చాలా రోజుల తర్వాత కనిపించిన కరణ్ జోహార్..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి ఓ విధంగా కరణ్ జోహార్ కారణమని పలువురు ఆరోపించారు. సుశాంత్ కు వచ్చిన సినిమా ఆఫర్లను తన కాంపౌండ్ కు చెందిన హీరోలకు ఇప్పించాడని ఎంతో మంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

గాలిలో వైరస్ వ్యాప్తి పై డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తోంది ?

ప్రపంచ దేశాల్లో తన విశ్వరూపం చూపిస్తూ..ఆర్థికంగా మరింత దెబ్బతీస్తోన్న కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందన్న వాదన కొద్దిరోజులుగా వినిపిస్తోంది. 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని చెబుతూ డబ్ల్యూహెచ్ఓకు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా వారి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బ్రేకింగ్‌: మోస్ట్ వాంటెడ్‌ వికాస్‌ దూబే హతం

ఉత్తరప్రదేశ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌, గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దూబే హతమైనట్లు యూపీ పోలీసులు అధికారికంగా వెల్లడించారు. అయితే గత వారం రోజుల కిందట 8 మంది పోలీసులను హతమార్చిన వికాస్‌ దూబే కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటి వరకూ దూబే అనుచరులైన ముగ్గురిని సైతం పోలీసులు హతమార్చారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పోలీసుల శవాలను తగులబెట్టాలనుకున్నా.. విచారణలో వికాస్‌ దూబే సంచలన విషయాలు వెల్లడి

8 మంది పోలీసులను మట్టుబెట్టి వారం రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎట్టకేలకు పోలీసులు హతమార్చారు. అయితే గురువారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి వెళ్లగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతన్ని యూపీ తరలిస్తుండగా, కాన్పూర్‌ సమీపంలో వారి వాహనం బోల్తా పడింది. దీంతో పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కోని కాల్పులు జరుపుతూ పారారవుతుండగా, పోలీసులు అతమార్చారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆస్ప‌త్రిలో విలన్ పొన్నాంబళం.. సహాయం చేయడానికి ముందుకొచ్చిన కమల్

పొన్నాంబళం ఎన్నో తమిళ సినిమాల్లో విలన్ గా నటించాడు. తెలుగు సినిమాల్లో కూడా కొన్ని ఫైట్ సీక్వెన్స్ కోసం తీసుకుని వచ్చే వాళ్లు..! ఆయన ఆసుపత్రి పాలవ్వడంతో సహాయం చేయడానికి కమల్ హాసన్ ముందుకు వచ్చారు. పొన్నాంబళం చెన్నై లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. కిడ్నీ సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలో చేర్చారు. పొన్నాంబళం పరిస్థితి గురించి తెలుసుకున్న లోకనాయకుడు కమల్ హాసన్ అతడికి ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పరుగులు పెడుతున్న బంగారం ధర

దేశంలో బంగారం ధర పరుగులు పెడుతోంది. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్నబంగారం ధర ఇప్పుడు కొండెక్కుతోంది. ఎక్సైజ్‌ సుంకం, రాష్ట్ర పన్నులు, ఛార్జీలు వసూలు చేయడం కారణంగా దేశంలో బంగారం అభరణాల ధర పెరిగిపోతోంది. ప్రస్తుతం భారత్‌ మార్కెట్లో పసిడి ధర రికార్డు సృష్టిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారంపై రూ.480 పెరిగి ప్రస్తుతం రూ. 51,460కి ఎగబాకింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story
Share it