అతిపెద్ద సోలార్‌ ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

By సుభాష్  Published on  10 July 2020 11:04 AM GMT
అతిపెద్ద సోలార్‌ ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

అతిపెద్ద సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు భారత ప్రధాని నరేంద్రమోదీ. మధ్యప్రదేశ్‌లోని రేవాలో నిర్మించిన ఈ విద్యుత్‌ ప్లాంట్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ ప్రారంభించారు. ఈ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ 750 మెగావాట్లతో నిర్మించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న మొదటి ఐదు దేశాల్లో భారత్‌ ఒకటని గుర్తు చేశారు. సోలార్‌ విద్యుత్‌ ఇప్పటిది కాదు.. 21వ శతాబ్దపు అవసరాలను తీర్చేదని పేర్కొన్నారు. ఈ ప్లాంట్‌ వద్ద మధ్యప్రదేశ్‌ శుధ్ద, సౌర ఇంధనానికి కేంద్రంగా ఎదుగుతుందని ఆయన ఆకాంక్షించారు. పర్యావరణహిత విద్యుత్‌ వినియోగానికి ప్రోత్సహిస్తూ, దేశ వ్యాప్తంగా 36 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను అందించామని, దీంతో డిమాండ్‌ పెరిగి ఉత్పత్తి కూడా పెరిగిందన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విద్యుత్‌ రంగానికి చాలా కీలకమన్నారు.

అభివృద్ధి పరంగా భారత్‌ దూసుకెళ్తోందని, భారత్‌ కొత్త శిఖరాలకు ఎదుగుతున్నకొద్ది మన ఆశలు పెరుగుతున్నాయన్నారు. రూ. 4500 కోట్లతో ఈ సోలార్‌ పార్క్‌ను ఏర్పాటు చేసినట్లు మోదీ చెప్పారు. ఆ పార్క్‌లోని మూడు విభాగాలలో 250 మెగావాట్ల చొప్పున విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని, ఈ ప్రాజెక్టులో 24 శాతం విద్యుత్‌ను ఢిల్లీ మెట్రోకు సరఫరా చేయనున్నామని తెలిపారు.



Next Story