బ్రేకింగ్‌: మోస్ట్ వాంటెడ్‌ వికాస్‌ దూబే హతం

By సుభాష్  Published on  10 July 2020 2:59 AM GMT
బ్రేకింగ్‌: మోస్ట్ వాంటెడ్‌ వికాస్‌ దూబే హతం

ఉత్తరప్రదేశ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌, గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దూబే హతమైనట్లు యూపీ పోలీసులు అధికారికంగా వెల్లడించారు. అయితే గత వారం రోజుల కిందట 8 మంది పోలీసులను హతమార్చిన వికాస్‌ దూబే కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటి వరకూ దూబే అనుచరులైన ముగ్గురిని సైతం పోలీసులు హతమార్చారు. కాగా, గురువారం ఉజ్జయిని మహాంకాళి దేవాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లగా, పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు.

ఈ క్రమంలో వికాస్‌ దూబేను కాన్పూర్‌కు వాహనంలో తరలిస్తుండగా, వారి వాహనం బోల్తాపింది. అదే అదనుగా భావించిన గ్యాంగ్‌స్టర్‌ దూబే పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కోని పారిపోతూ కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు దూబేను ఎన్‌ కౌంటర్‌ చేశారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాన్పూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాగా, 8 మంది పోలీసులను పొట్టనపెట్టుకున్న దూబే.. మధ్యప్రదేశ్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. అతనితోపాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్‌ చేశారు. అనంతరం మధ్యప్రదేశ్‌ పోలీసులు అతన్ని ఉత్తరప్రదేశ్‌ స్పెషల్‌ ట్రాస్క్‌ ఫోర్స్‌ కు అప్పగించింది. ఇక ఉజ్జయిని నుంచి రోడ్డు మార్గం గుండా ఉత్తరప్రదేశ్‌కు తరలింస్తుండగా, కాన్పూర్‌ సమీపంలోఎస్టీఎఫ్‌ వాహనం బోల్తాపడింది. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు కాల్పులు జరిపి హతమార్చారు.

కాగా, రెండు రోజుల కిందట వికాస్‌ దూబే ప్రధాన అనుచరుడు అమర్‌ దూబేను కాల్చి చంపగా, తర్వాత వికాస్‌ దూబే అనుచరులు బహువా దూబే, ప్రభాత్‌ మిశ్రాపోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.

జూలై 3న కాన్పూర్‌ సమీపంలోని చౌబేపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగిది. రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసులు మృతి చెందారు.వీరిలో డీఎస్పీతో పాటు ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే, అతడి అనుచరుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే కొందరు పోలీసులు వికాస్‌ దూబేకు అనుకూలంగా పని చేస్తున్నారని, వారు ఇచ్చిన సమాఆరంతోనే పోలీసులపై కాల్పులు జరిపారని తేలింది. ఈ క్రమంలో ఇన్‌ స్పెక్టర్‌ వినయ్‌ తివారీని బుధవారం యూపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వికాస్‌ దూబే విచారణలో కీలక అంశాలను పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది. తనకు చాలామంది పోలీసులతో సంబంధాలున్నాయని అతడు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా,వారి వివరాలను వెల్లడించాడా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.Next Story
Share it