ప్రధానమంత్రిని తీసివేయాలని చెప్పలేదే: మమతా బెనర్జీ

By సుభాష్  Published on  6 Jun 2020 4:22 AM GMT
ప్రధానమంత్రిని తీసివేయాలని చెప్పలేదే: మమతా బెనర్జీ

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష పార్టీ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఓ వైపు కరోనా మహమ్మారి, మరో వైపు అంఫాన్ తుఫాను కారణంగా జరిగిన నష్టం రాష్ట్రాన్ని కుదిపేస్తూ ఉంటే బీజీపీ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

కోవిద్-19 కు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాము.. అంఫాన్ తుఫాను కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునే పనిలో ఉన్నాము.. ఇలాంటి సమయంలో కొన్ని పొలిటికల్ పార్టీలు మమ్మల్ని అధికారం నుండి తీసివేయాలని అనుకుంటున్నాయి. నేను ప్రధానమంత్రి(నరేంద్ర) మోదీని తీసివేయాలని ఎప్పుడూ అడగలేదే అని ఆమె మమతా బెనర్జీ అన్నారు.

రాజకీయాలు చేయడానికి ఇదా సమయం..? గత మూడు నెలలుగా వాళ్లు ఎక్కడకు పోయారు? ఇంతలా కష్టపడుతూ ఉంటే ఇప్పుడు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి మీద.. ఇలాంటి నీచపు రాజకీయాల మీద బెంగాల్ తప్పకుండా విజయం సాధిస్తుంది అని ఆమె అన్నారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పటికీ పెన్షనర్లకూ, ప్రభుత్వ ఉద్యోగులకూ సకాలంలో చెల్లించాం. ఇక తుఫాను ద్వారా నష్టపోయిన వాళ్లందరినీ ఆదుకునే పనిలో ఉన్నాము. ఇప్పటికే 25 లక్షల రైతులకు, 5 లక్షల కుటుంబాలకు నష్టపరిహారం అన్నది అందింది అని ఆమె చెప్పుకొచ్చారు.

ఇది చదవండి: మార్కెట్ లో సామాజిక దూరం పాటించని ప్రజలు.. పోలీసు ఏమి చేశాడంటే..?

అంఫాన్ తుఫాను ద్వారా వెస్ట్ బెంగాల్ కు లక్ష కోట్ల నష్టం వచ్చిందని మమతా బెనర్జీ చెబుతోందని.. అలా చెప్పి కేంద్రం నుండి డబ్బులు తీసుకోవాలన్నది ఆమె ట్రిక్స్ అంటూ వెస్ట్ బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్ గురువారం నాడు ఆరోపించారు. విపత్తుల ద్వారా కూడా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు.. గతంలో సిపిఐ-ఎం కు ఇలాంటి అలవాటు ఉండేది.. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కు అంటుకుంది అని ఆయన ఆరోపణలు చేశారు. అంఫాన్ తుఫానును జాతీయ విపత్తుగా పరిగణించమని మమతా బెనర్జీ కోరిందని.. కేంద్ర ప్రభుత్వానికి అంఫాన్ ద్వారా ఎంత నష్టం వచ్చిందో చెబుతూ లెక్కలు మాత్రం సరైనవి చెప్పలేదని ఆయన ఆరోపించారు.

వచ్చే ఏడాది వెస్ట్ బెంగాల్ లో ఎన్నికలు ఉండడంతో అప్పుడే రాజకీయ వేడి రాజుకుంటోంది. విపత్తుల సమయంలో కూడా రాజకీయాల గురించే నాయకులు ఫోకస్ చేస్తుండడాన్ని ప్రజలు గమనిస్తూఉన్నారు.

ఇవి చదవండి:

హైదరాబాద్‌లో నాలుగు హత్యలు.. నగరంలో తీవ్ర కలకలం

దారుణం.. భర్త మర్మాంగం కోసేసి..

Next Story