మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సంచలన వ్యాఖ్యలు..!

By అంజి  Published on  6 Dec 2019 6:15 AM GMT
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సంచలన వ్యాఖ్యలు..!

ఢిల్లీ: మాజీ ప్రధాని ఐ.కె గుజ్రాల్‌ జ్ఞాపకార్థ కార్యక్రమంలో మన్మోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖలు ఇప్పుడు హాట్‌ టాఫిక్‌గా మారాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణాంతరం 1984లో జరిగిన సిక్కుల ఊచకోతపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడారు. ఐ.కె గుజ్రాల్‌ సలహాను పీవీ నరసింహారావు వినివుంటే ఆనాడు సిక్కుల ఊచకోత జరిగేది కాదంటూ మన్మోహన్‌ సింగ్‌ వ్యాఖ్యనించారు. ఇందిరాగాంధీ హత్య తరువాత ఢిల్లీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఢిల్లీ పరిస్థితులను గమనించిన గుజ్రాల్‌ వెంటనే అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావును కలిసి సైన్యాన్ని రంగంలోకి దింపాలని కోరారు. సైన్యం రంగంలోకి దిగితే ఢిల్లీలోని పరిస్థితులను అదుపులోకి తీసుకురావచ్చని పీవీకి గుజ్రాల్‌ సూచించారు. అయితే గుజ్రాల్‌ సూచనను పీవీ పట్టించుకోలేదు. ఆనాడు ఆ సలహా పాటించి ఉంటే సిక్కుల ఊతకోచ జరిగేది కాదన్నారు. సిక్కుల ఊచకోత ఘటనలో పీవీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి.

మన్మోహన్‌ సింగ్‌ తన రాజకీయ గురువుపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ మన్మోహన్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తక్షణమే పీవీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశానికి కాంగ్రెస్‌ తరఫున మంచి జరిగితే గాంధీ కుటుంబానికి, చెడు జరిగితే పీవీ కుంటుబానికి ఆపాదిస్తారా? అంటూ ధ్వజమెత్తారు. సిక్కుల ఊచకోత సమయంలో పీవీకి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశమే లేదన్నారు. కాగా మన్మోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఇందిరాగాంధీ తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ గాంధీనే ఊచకోతకు బాధ్యత వహించాలని కేంద్రమంత్రి జావదేక్‌ ఆరోపణలు చేశారు. మన్మోహన్‌సింగ్‌ చేసిన ఈ వ్యాఖ్యలను అకాలీదళ్‌ ఎంపీ, గుజ్రాల్‌ తనయుడు నరేశ్‌ గుజ్రాల్‌ సమర్థించారు.

Next Story