చేసిన సాయం ఎక్కడికి పోతుంది.. భారత్ కు సహాయం చేయడానికి ముందుకొస్తున్న దేశాలు

Zydus Cadila's Virafin gets DCGI nod for hepatitis drug for Covid-19 treatment. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ భారత్ పై తీవ్ర ప్రభావం

By Medi Samrat  Published on  23 April 2021 8:35 PM IST
చేసిన సాయం ఎక్కడికి పోతుంది.. భారత్ కు సహాయం చేయడానికి ముందుకొస్తున్న దేశాలు

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ భారత్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. నేడు కూడా మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు కూడా లభించడం లేదు. ఇక రెమ్‌డెసివిర్ కొరత గురించి చర్చించుకుంటూ ఉన్నారు. ఇన్ని రోజులూ చాలా విషయాల్లో ఇతర దేశాలకు సహాయం చేసిన భారత్ కు సహాయం చేయడానికి పలు దేశాలు ముందుకు వస్తున్నాయి.

భారత్ ను ఆదుకోడానికి రష్యా ముందుకు వస్తోంది. భారత్‌కు ఈ రెండింటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపిన రష్యా.. వచ్చే 15 రోజుల్లోనే వాటిని పంపాలని నిర్ణయించుకుంది. వారానికి 3,00,000-4,00,000 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, నౌక ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తామని రష్యా ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. దేశంలో రెమ్‌డెసివిర్ డ్రగ్స్‌కు కొరత ఏర్పడడంతో భారత ప్రభుత్వం వాటి ఎగుమతులను ఇటీవల నిషేధించింది. దిగుమతి సుంకాలను రద్దు చేసింది.

కరోనా వైరస్‌ చికిత్సలో రెమ్‌డెసివిర్‌ అనే యాంటీవైరల్‌ డ్రగ్‌ను భారత్ వినియోగిస్తూ ఉండగా.. ఔషధ సంస్థ జైడస్‌ క్యాడిలా రూపొందించిన 'విరాఫిన్‌' అనే మరో ఔషధాన్ని కూడా కరోనా చికిత్సలో వాడేందుకు డిసిజిఐ అనుమతించింది. బాధితులు త్వరగా కోలుకోవడంతో పాటు చాలా వరకు లక్షణాలు ముదరకుండా ఈ ఔషధం నిలువరిస్తోందని జైడస్‌ తెలిపింది. ప్రారంభంలోనే ఈ ఔషధాన్ని ఇవ్వడం వల్ల వైరల్‌ లోడ్‌ను భారీగా తగ్గించే అవకాశం ఉందని సంస్థ ఎండీ శార్విల్‌ పటేల్‌ తెలిపారు. 'పెగిలేటెడ్‌ ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా 2బీ(PegIFN)' శాస్త్రీయ నామం గల విరాఫిన్‌పై జైడస్‌ క్యాడిలా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఔషధం తీసుకున్న 91.15 శాతం మందిలో ఏడు రోజుల్లో వైరస్‌ పూర్తిగా తగ్గిపోయి నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యిందని చెబుతున్నారు.


Next Story