ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ జైడస్ క్యాడిలా ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోన్న సంగతి తెలిసిందే. జైకోవ్-డీ పేరుతో దీన్ని తయారు చేస్తోంది. ప్లాసిడ్ డీఎన్ఏ వ్యాక్సిన్ ఇది. అన్నీ సవ్యంగా సాగితే జూన్ రెండోవారం నాటికి- ఈ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగంలోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. ఇందుకు సంబంధించి 12 నుంచి 18 సంవత్సరాలలోపు వయస్సున్న వారిపైనా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది జైడస్ క్యాడిలా. దాదాపు 800 వందల మందిపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తుంది.
ఇప్పటికే పెద్దలు, టీనేజ్ వయసు వారిపై ట్రయల్స్ నిర్వహిస్తున్న జైడస్ క్యాడిలా.. సంస్థ మరో అడుగు ముందుకేసి 5-12 ఏళ్ల వయసు ఉన్న పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్‌కు సిద్దమవుతుంది. ఈ విషయమై సంస్థ ఎండి శార్విల్ పటేల్ మాట్లాడుతూ.. త్వరలోనే 5 నుంచి 12 సంవత్సరాల చిన్నారులపై వ్యాక్సిన్ ట్రయల్స్ చేపట్టబోతున్నామని వెల్లడించారు. అయితే.. పెద్దల కోసం తయారు చేస్తున్న టీకాకు జూన్ చివరి నాటికి లేదా జులైలో అనుమతి రావచ్చని తెలుస్తోంది.