త్వరలో అందుబాటులోకి రానున్న మ‌రో వ్యాక్సిన్‌

Zydus Cadila seeks emergency authorisation for ZyCoV-D Covid-19 vaccine for 12 years. భార‌త్ లో కొత్త‌గా మ‌రో వ్యాక్సిన్‌

By Medi Samrat  Published on  1 July 2021 11:29 AM IST
త్వరలో అందుబాటులోకి రానున్న మ‌రో వ్యాక్సిన్‌

భార‌త్ లో కొత్త‌గా మ‌రో వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. గుజరాత్ కు చెందిన‌ జైడస్‌ క్యాడిలా అనే ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన 'జైకోవ్‌ - డి' టీకా అత్యవసర వినియోగ అనుమతుల కోసం కంపెనీ గురువారం డీసీజీఐకు దరఖాస్తు చేసుకుంది. కరోనాను ఎదుర్కొనేందుకు డీఎన్‌ఏ సాంకేతికతతో 'జైకోవ్‌-డి' టీకాను తయారుచేసింది. అయితే.. 'జైకోవ్‌ - డి' మూడు డోసుల టీకా. ఇప్ప‌టికే 28వేల మందిపై మూడో దశ ట్ర‌య‌ల్స్‌ కూడా పూర్తయ్యాయి.

ఈ నేఫ‌థ్యంలో డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. 12ఏళ్లు అంతకంటే పైబడిన వారికి ఈ టీకా అందించేలా వినియోగ అనుమతులు ఇవ్వాలని కోరింది. అత్యవసర అనుమతులు లభించిన తర్వాత ఏడాదికి 12కోట్ల టీకా డోసులను ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. జైకోవ్‌-డి టీకాకు అనుమతులు లభిస్తే ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్‌ ఇదే అవుతుంది. అలాగే.. 12-18 ఏళ్ల వారికి అందుబాటులోకి వచ్చే తొలి టీకా కూడా ఇదే కానుంది.


Next Story