చిన్నారులకు కరోనా వ్యాక్సిన్.. ధర ఎంతంటే..?

Zydus Cadila proposes Rs 1900 for three-dose Covid vaccine. చిన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకురావడానికి పలు కంపెనీలు తమ ప్రయత్నాలను

By Medi Samrat  Published on  4 Oct 2021 6:50 AM GMT
చిన్నారులకు కరోనా వ్యాక్సిన్.. ధర ఎంతంటే..?

చిన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకురావడానికి పలు కంపెనీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అందులో జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ ముందుంది. దేశీయంగా చిన్నారుల కోసం తయారు చేసిన 'జైకోవ్-డీ' టీకా ధరను ఆ కంపెనీ ప్రకటించింది. 12 ఏళ్లు పైబడిన చిన్నారులకు మూడు డోసులుగా ఇవ్వాల్సి ఉంది. ఈ వ్యాక్సిన్ ధరను రూ. 1900గా సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ధర తగ్గింపు విషయంలో జైడస్ క్యాడిలా సంస్థతో కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

0, 28, 56 రోజుల వ్యవధిలో మూడు డోసులు ఇవ్వాలని జైడస్ క్యాడిలా సంస్థ తెలిపింది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు రెండు డోసులైతే..జైకోవ్ డి వ్యాక్సిన్ మూడు డోసులు ఇవ్వాల్సి వస్తుంది. ప్రపంచంలోనే డీఎన్ఏ ఆధారంగా తయారైన మొట్టమొదటి టీకా 'జైకోవ్-డీ'. ఈ టీకాను జెట్ ఇంజెక్టర్‌తో ఇవ్వాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది. చిన్నారులకు ఇవ్వాల్సిన టీకా విషయంలో కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ప్రాధాన్య క్రమంలోనే చిన్నారులకు టీకా ఇవ్వనున్నట్లు సమాచారం. ముఖ్యంగా తీవ్ర ఆరోగ్య సమస్యలున్న 12-18 ఏళ్ల చిన్నారులకే తొలి ప్రాధాన్యమని.. ఆ తర్వాత సాధారణ పిల్లలకు వ్యాక్సిన్ అందజేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇక కోవాగ్జిన్ కూడా చిన్నారులకిచ్చే వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తి చేసుకుని..డీసీజీఐ అనుమతి కోసం వేచి చూస్తోంది.


Next Story