వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

YS Bhaskar Reddy remanded for 14 days. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

By M.S.R  Published on  16 April 2023 6:07 PM IST
వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

YS Bhaskar Reddy


మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మధ్యాహ్నం పులివెందుల నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. ఆయనను సీబీఐ అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం సీబీఐ న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లారు. భాస్కర్ రెడ్డిని సీబీఐ జడ్జి ఎదుట హాజరు పరిచారు. వైద్య పరీక్షల నివేదికను జడ్జికి సమర్పించారు. అన్ని వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నెల 29 వరకు భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధిస్తున్నట్టు సీబీఐ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు.


Next Story