మాస్కు పెట్టుకొమన్నందుకు పోలీసునే కొట్టేశాడు

Young Man Slapped Sub Inspector And Ran Away in Kushinagar. కరోనా మహమ్మారి విపరీతంగా ప్రబలుతున్న ఈ సమయంలో మాస్కు చాలా

By Medi Samrat  Published on  24 April 2021 3:53 PM IST
మాస్కు పెట్టుకొమన్నందుకు పోలీసునే కొట్టేశాడు

కరోనా మహమ్మారి విపరీతంగా ప్రబలుతున్న ఈ సమయంలో మాస్కు చాలా ముఖ్యమని చెబుతూ ఉన్నారు. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోడానికి మాస్కు పెట్టుకోవాలని ప్రభుత్వాలు, అధికారులు చెబుతూనే ఉన్నారు. ఇక మాస్కులు పెట్టుకోకుండా బయట తిరుగుతూ ఉన్న వారిపై పోలీసులు చలానాలు విధిస్తూ ఉన్నారు. అలా ఓ యువకుడిని మాస్కు పెట్టుకోలేదు నువ్వు.. తప్పు కదా అని ప్రశ్నించిన ఓ పోలీసు ఆఫీసర్ ను కొట్టేసి పారిపోయాడు ఓ యువకుడు.

యువకుడు మాస్క్‌ పెట్టుకోలేదని ఆడిగినందుకు పోలీసు చెంప చెళ్లుమనిపించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అక్కడ కరోనాను కట్టడి చేయడానికి పోలీసులు తమ ప్రత్యేక వాహనాల్లో రౌండ్స్ వెళుతూ ఉన్నారు. ఖుషీ నగర్‌లో ఓ యవకుడు మాస్క్ లేకుండా వెళ్తుంటే.. కానిస్టేబుల్ గమనించాడు. అతన్ని ఆపి జీపులో ఉన్న ఇన్‌స్పెక్టర్ దగ్గరకు పంపాడు. ఇన్‌స్పెక్టర్ ఆ కుర్రాడి కాలర్ పట్టుకొని మాస్క్ పెట్టుకోకుండా ఎందుకు ఉన్నావు అని అన్నాడు. కొన్ని నీతి మాటలు చెప్పేసి.. వెళ్లిపొమ్మని చెబుతూ ఉన్న సమయంలో.. ఆ కుర్రాడు ఇన్‌స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు. షాకవ్వడం ఇన్‌స్పెక్టర్ వంతైంది. అతన్ని పట్టుకుందామని పరుగెత్తిన కానిస్టేబుల్‌కి అతన్ని పట్టుకోవడం కుదరలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.


Next Story