డీజేలో డ్యాన్స్ చేస్తూ యువకుడి మృతి.. తాగి పడిపోయాడనుకున్న స్నేహితులు

Young man dies while dancing on DJ in Madhyapradesh. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఎవరి ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో పైవాడికి మాత్రమే తెలుసు. తాజాగా అలాంటి హృదయ

By అంజి  Published on  24 Jan 2022 9:47 AM IST
డీజేలో డ్యాన్స్ చేస్తూ యువకుడి మృతి.. తాగి పడిపోయాడనుకున్న స్నేహితులు

మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఎవరి ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో పైవాడికి మాత్రమే తెలుసు. తాజాగా అలాంటి హృదయ విదారక సంఘటన యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి ఆనందం మధ్య, ఇది ఎలా జరిగిందో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. శనివారం రాత్రి డీజేలో డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. సమాచారం ప్రకారం ఓ వివాహ వేడుకలో డీజేపై డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు హఠాత్తుగా మృతి చెందాడు. అతను డీజేలో బాగా డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలోనే నేలపై పడిపోయాడు, ఆ తర్వాత అతను లేవలేదు. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందడంతో పెళ్లి ఇంట విషాదఛాయలు అలముకున్నాయి.

పెళ్లి జరిగిన రోజు రాత్రి గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువకుడు అంతులాల్ డీజేలో డ్యాన్స్ చేస్తూ బిజీగా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. అతను ఒంటరిగా డీజేలో డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. అక్కడ ఉన్న వ్యక్తులు అతని డ్యాన్స్ వీడియోలను మొబైల్ నుండి తీస్తూనే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఊపిరి పీల్చుకుని నేలపై పడిపోయాడు. అయితే అక్కడ ఉన్నవారు అతనికి మైకం వచ్చిందని, లేదంటే మద్యం మత్తులో పడిపోయాడని అనుకున్నారు. తాగి వచ్చి పడ్డాడని అనుకున్నారు. యువకుడు పడిపోయిన తర్వాత, అతను ఎటువంటి కదలికలు చేయకుండా చూడగానే, ఆ వ్యక్తి చేతులు ఉబ్బిపోయాయి. ప్రజలు హడావిడిగా అతని ముఖంపై నీళ్లు చల్లారు, కానీ అతను అలాగే ఉన్నాడు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన అనంతరం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో యువకుడు మృతి చెందినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story