ఇప్పుడేంటి.. పాకిస్తాన్‌లో పరిశ్రమలపై నిషేధం విధించాలా.. సుప్రీంకోర్టు ఆగ్రహం.!

You want us to ban industries in Pakistan.. Supreme Court to UP Govt over air pollution. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. గాలి కాలుష్యం కట్టడికి కేంద్రం, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు ఎందుకు

By అంజి
Published on : 3 Dec 2021 8:34 AM

ఇప్పుడేంటి.. పాకిస్తాన్‌లో పరిశ్రమలపై నిషేధం విధించాలా.. సుప్రీంకోర్టు ఆగ్రహం.!

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. గాలి కాలుష్యం కట్టడికి కేంద్రం, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని సీరియస్‌ అయ్యింది. ఈ సందర్భంగా పాకిస్థాన్‌లోని పరిశ్రమలపై కోర్టు నిషేధం విధించాలని కోరుతున్నారా అని సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఢిల్లీలో కాలుష్యానికి ప్రధాన కారణం పాకిస్థాన్ నుంచి వీస్తున్న కలుషిత గాలి అని యూపీ ప్రభుత్వ న్యాయవాది చేసిన వ్యాఖ్యపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. 'పాకిస్థాన్‌లోని పరిశ్రమలను నిషేధించాలని మీరు కోరుతున్నారా' అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ప్రశ్నించారు.

ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉండటంలో ఉత్తరప్రదేశ్‌లోని పరిశ్రమల పాత్ర లేదని కుమార్ కోర్టుకు తెలిపారు. యుపి గాలి కాలుష్యం లేదని, కలుషితమైన గాలి ఎక్కువగా పాకిస్తాన్ నుండి వస్తోందని కుమార్ వాదించారు. చెరకు, పాడి పరిశ్రమలపై ప్రభావం చూపుతుందని పేర్కొంటూ పరిశ్రమలను మూసివేయాలని ఆదేశించడం వెనుక ఉన్న హేతుబద్ధతను కూడా యూపీ ప్రభుత్వం ప్రశ్నించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్, పరిసర ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) గతంలో పరిశ్రమలను ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాలని ఆదేశించింది.

ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం గురువారం జాతీయ రాజధాని ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కోసం కమిషన్ తీసుకున్న చర్యలను కూడా గమనించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో క్షీణిస్తున్న గాలి నాణ్యతను నియంత్రించడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టడం సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. 24 గంటల్లో కాలుష్యాన్ని నియంత్రించడానికి సూచనలతో ముందుకు రావాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఇవాళ సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. దేశ రాజధానిలో గాలి కాలుష్యం కట్టడికి ఐదుగురు సభ్యుల టాస్క్‌ఫోర్స్‌ఉన ఏ్పాటు చేస్తున్నట్లు కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది.

Next Story